దుబాయ్‌లో కొత్త మిలియనీర్‌ ఓ ఇండియన్‌ టీచర్‌

- January 29, 2018 , by Maagulf
దుబాయ్‌లో కొత్త మిలియనీర్‌ ఓ ఇండియన్‌ టీచర్‌

ఓ యాన్యువల్‌ డ్రా ఓ ఇండియన్‌ టీచర్‌ని బిలియనీర్‌గా మార్చేసింది. యూఏఈలో 19 ఏళ్ళ నుంచి టీచర్‌గా పనిచేస్తోన్న భారతీయ మహిళ అమృత జోషి, తన పిల్లల ఎడ్యుకేషన్‌ నిమిత్తం కమర్షియల్‌ బ్యాంక్‌లో సేవింగ్స్‌ చేస్తున్నారు. ఆ కమర్షియల్‌ బ్యాంక్‌, ఇంటర్నేషనల్‌ యాన్యువల్‌ డ్రాలో ఆమె ఎవరూ ఊహించని విధంగా 1 మిలియన్‌ దిర్హామ్‌లు గెల్చుకున్నారు. దాంతో ఆమె యూఏఈలో సరికొత్త మిలియనీర్‌గా అవతరించారు. బంపర్‌ డ్రాలో తాను 1 మిలియన్‌ దిర్హామ్‌లు గెలుచుకున్న విషయం గురించి సమాచారం అందుకున్న ఆమె, ఆ అనందాన్ని మాటల్లో వ్యక్తపరచలేకపోతున్నట్లు చెప్పారు. ఈ సొమ్ముతో, తన పిల్లలకు ఇంకా మెరుగైన విద్య, జీవనం అందించగలుగుతానని ఆమె అన్నారు. దుబాయ్‌కి చెందిన అల్యూమినియం ఫ్యాక్టరీ కార్మికుడు జహిర్ల్‌ ఇస్లామ్‌ కబీర్‌, డిసెంబర్‌లో జరిగిన డ్రాలో 100,000 దిర్హామ్‌లు గెల్చుకున్నారు. ఈ బహుమతి తన జీవితాన్ని మార్చేసిందని ఆయన అన్నారు. బంగ్లాదేశ్‌లో దీని విలువ 2 మిలియన్‌ బంగ్లాదేశీ టాకాలతో సమానమని ఆయన అన్నారు. తమ బ్యాంకు వినియోగదారులు గణనీయంగా పెరుగుతున్నారనీ, వారిని మరింత సంతోషపరిచేందుకు ఈ తరహా డ్రాలు నిర్వహిస్తున్నామని రిటెయిల్‌ బ్యాంక్‌ గ్రూప్‌ హెడ్‌ షకెర్‌ జైనాల్‌ చెప్పారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com