హిందూఖుష్‌లో భూకంపం; వణుకుతున్న నార్త్ ఇండియా

- January 31, 2018 , by Maagulf
హిందూఖుష్‌లో భూకంపం; వణుకుతున్న నార్త్ ఇండియా

న్యూఢిల్లీ : దేశరాజధాని సహా ఉత్తర భారతంలోని పలు రాష్ట్రాల్లో బుధవారం మధ్యాహ్నం భూమి ఒక్కసారిగా కంపించింది. అఫ్ఘనిస్థాన్‌లోని హిందూఖుష్‌ ప్రాంతంలో సంభవించిన భూకంపమే ఇందుకు కారణమని తెలిసింది.

హిందూఖుష్‌లో భూకంప కేంద్రాన్ని గుర్తించామని, రిక్టర్‌ స్కేలుపై తీవ్రత 6.1గా నమోదయిదని యూరప్‌-మధ్యధరా భూకంప కేంద్రం ఒక ప్రకటన చేసింది. జమ్ముకశ్మీర్‌లోనూ భూకంప ప్రభావం ఎక్కువగా ఉన్నట్లు సమాచారం. అయితే ప్రాణ, ఆస్తి నష్టాల వివరాలు తెలియాల్సిఉంది. ఢిల్లీ సహా ఇతర రాష్ట్రాల్లో భూప్రకంపనల ప్రభావం ఏమిటన్నది వెల్లడికావాల్సిఉంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com