ఇండియన్స్‌ స్కూల్‌ బహ్రెయిన్‌లో మేథ్స్‌ డే సెలబ్రేషన్స్‌

- February 01, 2018 , by Maagulf
ఇండియన్స్‌ స్కూల్‌ బహ్రెయిన్‌లో మేథ్స్‌ డే సెలబ్రేషన్స్‌

ప్రఖ్యాత మేథమేటీషియన్‌, దివంగత శ్రీనివాస రామానుజన్‌కి నివాళులర్పిస్తూ, ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ బహ్రెయిన్‌ (ఐఎస్‌బి) మేథమేటిక్స్‌ డిపార్ట్‌మెంట్‌, మేథ మేటిక్స్‌ డే 2018ని ఇసా టౌన్‌ స్కూల్‌ క్యాంపస్‌లో నిర్వహించింది. జనవరి 29న ఈ కార్యక్రమం జరిగింది. యూనివర్సిటీ ఆఫ్‌ బహ్రెయిన్‌ డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ మేథమేటిక్స్‌ మరియు ఛైర్మన్‌ డాక్టర్‌ ఫైసల్‌ అల్‌ షౌవైక్‌, న్యాయ నిర్ణేతగా పలు కాంపిటీషన్స్‌ మేథ్స్‌ సబ్జెక్ట్‌పై జరిగాయి. ఈ కార్యక్రమానికి ఐఎస్‌బి ఇసి మెంబర్‌ ప్రేమలత, ప్రిన్సిపాల్‌ విఆర్‌ పళనిస్వామి, వైస్‌ ప్రిన్సిపల్స్‌, స్టాఫ్‌ మరియు స్టూడెంట్స్‌ హాజరయ్యారు. డాక్టర్‌ ఫైసల్‌ అల్‌ షోవైక్‌ మేథమేటిక్స్‌ ఆవశ్యకతను తెలియజేశారు. మేథమేటిక్స్‌ హెడ్‌ ఆఫ్‌ ది డిపార్ట్‌మెంట్‌ సెంథిల్‌, ఆహూతులకు ఆహ్వానం పలికారు. 4 నుంచి 8 క్లాసులకు చెందిన 45 మంది స్టూడెంట్స్‌కి ఈ సందర్భంగా మ్యాట్స్‌ టాలెంట్‌ సెర్చ్‌ ఎగ్జామ్‌లో ప్రతిభ చూపించినందుకుగాను సర్టిఫికెట్లను అందజేశారు. మేథమేటిక్స్‌ బిహైండ్‌ మ్యూజిక్‌ టాపిక్‌పై 9 మరియు 11 తరగతులకు చెందిన విద్యార్థులకు పేపర్‌ ప్రెజెంటేషన్‌ కాంపిటీషన్‌ నిర్వహించారు. క్లాస్‌ 11-1కి చెందిన సత్మా అబ్రహామ్‌కి తొలి బహుమతలి లభించింది. రెండో బహుమతి 9-కెకి చెందిన రిధి నిలేష్‌కుమార్‌ గెల్చుకున్నారు. మూడో బహుమతి 11-1 నైఫా నలీమ్‌కి దక్కింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com