ఆవిష్కృతమైన రిచ్ రాజస్తానీ రాయల్ కల్చర్
- February 05, 2018
సఖిర్: రాజస్తానీ రాయల్ కల్చర్, ఆర్ట్, ఫుడ్, మ్యూజిక్ మరియు డాన్స్ వంటివన్నీ 'పదారో మిహారె దేశ్ 2018' ఈవెంట్‌లో కనువిందు చేశాయి. బహ్రెయిన్‌లోని రాజస్తానీలు (ఆర్‌ఐబి) ఈ ఈవెంట్‌ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఇండియన్ ఎంబసీతో కలిసి ఫిబ్రవరి 2న ఈ వెంట్ నిర్వహించడం జరిగింది. బహ్రెయిన్‌లో ఇండియన్ అంబాసిడర్ అలోక్ కుమార్ సిన్హా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. బహ్రెయిన్‌తోపాటు, భారతదేశానికి చెందిన వ్యాపారవేత్తలు, ప్రొఫెషనల్స్, బ్యాంకర్స్, ఎంబసీ అధికారులు ఈ ఈవెంట్‌లో పాల్గొన్నారు. అలోక్ కుమార్ సిన్హా మాట్లాడుతూ, ఇండియన్ టూరిజంని ఈ తరహా ఈవెంట్స్‌తో ప్రమోట్ చేయడం చాలా ఆనందంగా ఉందని అన్నారు. ఆర్‌ఐబి హెడ్ అలోక్ గుస్తా, బహ్రెయిన్ అభివృద్ధిలో రాజస్తానీయుల పాత్ర చాలా గొప్పదనీ, అలాగే భారతీయులకు బహ్రెయిన్‌లో రాజస్థానీయులు అందిస్తున్న సహాయ సహకారాలు మరువలేనివని అన్నారు. రాజస్థానీయులు తమ మాతృభూమిని అమితంగా ప్రేమిస్తారనీ, పని పట్ల తమకు చాలా నిబద్ధత ఉంటుందని ఈ సందర్భంగా అలోక్ గుప్తా వివరించారు. బహ్రెయిన్‌ని కర్మ్ భూమి (వర్క్ ప్లేస్)గా అభివర్ణించారాయన. 40 రకాలైన రాజస్తానీ ఫుడ్ డెలికసీస్ ఈ వెంట్‌లో ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. భారత ప్రభుత్వ నినాదం 'బేటీ బచావో బేటీ పడావో'ని ఇక్కడ గట్టిగా వినిపించారు.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్‌తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్‌ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి