ఇండియాకి ఒమన్‌ ఎయిర్‌ కొత్త విమానాలు

- February 05, 2018 , by Maagulf
ఇండియాకి ఒమన్‌ ఎయిర్‌ కొత్త విమానాలు

మస్కట్‌: నేషనల్‌ కెరీర్‌ ఒమన్‌ ఎయిర్‌, ఇండియాలోని వివిధ ప్రాంతాలకు అదనంగా విమాన సర్వీసుల్ని నడిపేందుకు సన్నాహాలు చేసుకుంటోంది. ఒమన్‌ ఎయిర్‌ సీఈఓ అబ్దుల్‌ అజీజ్‌ అల్‌ రైసి మాట్లాడుతూ, అహ్మదాబాద్‌, మంగళూరు, కోల్‌కతాలకు విమానాల్ని నడిపేందుకోసం ఒమన్‌ - ఇండియా ప్రభుత్వాలతో ఒప్పందాలు రివైజ్‌ కావాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. ఒమన్‌ ఎయిర్‌ కొత్త బోయింగ్‌ 737 మ్యాక్స్‌ని బహ్రెయిన్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌ పోర్ట్‌ వద్ద ప్రారంభిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు అబ్దుల్‌ అజీజ్‌. మొరాకో, టర్కీ, రష్యాలకు కూడా ఒమన్‌ ఎయిర్‌ విమానాల్ని నడపనుంది. బీరట్‌, సింగపూర్‌, చిట్టాగ్యాంగ్‌, ఢాకాలకు విమాన సర్వీసుల్ని రీ-లాంఛ్‌ చేయాలనుకుంటోంది ఒమన్‌ ఎయిర్‌. 2016లో ఒమన్‌ భారత్‌ మధ్య విమన సర్వీసులకు సంబంధించి ఒప్పందాల్లో సవరణ జరిగింది. ఆ సవరణ ప్రకారం ప్రతి వారం 6,258 సీట్ల నుంచి 27,405 సీట్ల వరకు పెరిగింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com