విద్యార్థులకు కౌన్సిలింగ్ సెషన్స్ ప్రారంభించిన ఇండియన్ స్కూల్స్
- February 05, 2018
మస్కట్: గ్రేడ్ 10, 12 బోర్డ్ ఎగ్జామ్స్ కోసం ఒమన్‌లోని ఇండియన్ స్కూల్స్ తమ విద్యార్థులకు ప్రీ ఎగ్జామ్ సైకలాజికల్ కౌన్సిలింగ్ ప్రారంభించాయి. ఏప్రిల్ 13 వరకు ఈ కౌన్సిలింగ్ జరుగుతుంది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకెండరీ ఎడ్యుకేషన్ (సిబిఎస్ఇ) యాన్యువల్ కౌన్సిలింగ్ ప్రోగ్రామ్, ప్రపంచ వ్యాప్తంగా స్టూడెంట్స్ మరియు పేరెంట్స్‌కి నిర్వహిస్తూ వస్తోంది. ఇండియన్ స్కూల్ దర్సైత్ ప్రిన్సిపల్ డాక్టర్ శ్రీదేవి పి తష్నాథ్ మరోసారి సిబిఎస్ఇ ప్రీ ఎగ్జామ్ సైకలాజికల్ కౌన్సిలర్‌గా ఒమన్‌లో నియమితులయ్యారు. సాధారణ సైకలాజికల్ సమస్యలకు, ఎగ్జామ్ రిలేటెడ్ స్ట్రెస్‌కి సంబంధించిన సమస్యలనుంచి బయటపడేందుకు ఆమె నేతృత్వంలో కౌన్సిలింగ్ కార్యక్రమాలు జరుగుతాయి. సిబిఎస్ఇ వరుసగా ఐదోసారి ఆమెను కౌన్సిలర్‌గా నియమించడం జరిగింది. మార్చిలో జరిగే పరీక్షలకు మాజరయ్యే విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఈ కౌన్సిలింగ్ సేవల్ని వినియోగించుకోవచ్చు. ఫిబ్రవరి 1 నుంచి 13 ఏప్రిల్ వరకు ఈ కౌన్సిలింగ్ ఉదయం 8 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు జరుగుతాయి.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్‌తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్‌ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి