ఆశలు పెట్టుకున్నతెలుగు రాష్ట్రముల సీఎంలకు షాకింగ్ న్యూస్
- February 05, 2018
వలసలు ప్రోత్సహించి ఆశలు పెట్టుకున్న తెలుగురాష్ట్రాల్లోని అధికార పార్టీలకు ఇది షాకింగ్ న్యూసే. బడ్జెట్లో మొండిచేయి చూపారంటూ ఆగ్రహంతో రగిలిపోతున్న TRS,. TDP నేతలకు పుండుమీద కారం జల్లినట్టుగా ఉంది. జైట్లీ పద్దుల్లో ఆర్ధికంగా ఆదుకోకపోయినా.. నియోజకవర్గాల పెంపుపైనా ముఖం చాటేయడంపై అటు తమ్ముళ్లు... ఇటు అంశాలవారీగా మోడీ సర్కార్ కు మద్దతిస్తున్నగులాబీ శ్రేణులు భగ్గుమంటున్నాయి.
అయితే తమ ప్రయోజనాలకు విరుద్దంగా ఏ నిర్ణయం తీసుకోలేమంటున్నారు బీజేపీ నాయకులు. సీట్లు పెరిగిన అధికారంలో ఉన్న రెండు పార్టీలకు ఉపయోగం తప్ప.. తమకు ఒనగూరే ప్రయోజనం లేనప్పుడు బిల్లు ఎందుకు పెట్టాలన్న భావన వ్యక్తమవుతోంది. ఇదే కాదు.. బడ్జెట్ విషయంలో కూడా టీడీపీ, టిఆర్ఎస్ విమర్శలకు గట్టిగా సమాధానం చెప్పాలని నిర్ణయించుకున్నారు. అందుకే అటు సోము వీర్రాజు... ఇటు తెలంగాణ కమలనాధులు నోటికి పనిచెప్పారు. కొంతమంది బీజేపీ నాయకుల సొంత ఎజెండా అని ప్రచారమున్నా.. అమిత్ షాతో మీటింగ్ తర్వాత తెలుగు రాష్ట్రాల నాయకుల వైఖరిలో మార్పు వచ్చినట్టు చెబుతున్నారు. అధ్యక్షుడితో డైరెక్షన్లోనే నాయకుల స్వరం పెంచారని.. పార్టీ ఎజెండానే పక్కాగా అమలు చేస్తున్నారని అంటున్నారు.
స్థాయిని తగ్గించుకుని మిత్రపక్షం విమర్శలను భరించాల్సిన అవసరం లేదన్న అమిత్ షా నిర్దేశంతోనే ఏపీలో పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఏకంగా నారావారి ఆస్తులనే టార్గెట్ చేయడం అంత ఆషామాషీ వ్యవహారం కాదు. పార్టీ విధానాలకు భిన్నంగా వ్యవహరిస్తే క్రమశిక్షణా చర్యలు తప్పవని అమిత్ షా హెచ్చరించిన తర్వాతే సోము వీర్రాజు మిత్రధర్మం మీరడం వెనక పార్టీ ఎజెండా ఉందని టీడీపీ నాయకులు బలంగా నమ్ముతున్నారు.
కేంద్రంలో మంత్రి పదవులు తీసుకున్న టీడీపీ.. జైట్లీపైనా. ప్రధానిపైనా విమర్శలు చెసినప్పుడు.. ఇక్కడ మాత్రం ఎందుకు ఉపేక్షించాలన్న వాదన అమిత్ షా మీటింగులో వచ్చినట్టు తెలుస్తోంది. అదే సోము వీర్రాజు వంటివారి నోటికి పనిచెబుతోందంటున్నాయి పార్టీ వర్గాలు.
బడ్జెట్ తర్వాత తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ పరిణామాలపై విసృతంగా చర్చించిన కమలనాధులు. భవిష్యత్తు వ్యూహాలపై దృష్టి సారించారు. ఒంటరిపోరుకైనా...చివరి నిమిషంలో పొత్తులకైనా సిద్దంగా ఉండాలని అమిత్ షా ఉధ్బోధించారు.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్‌తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్‌ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి