సౌదీ అరేబియాకు హషీష్ అక్రమ రవాణాని అడ్డుకొన్న సరిహద్దు దళం
- February 05, 2018
జెడ్డా : గల్ఫ్ దేశాలలో మాదక ద్రవ్యాల వినియోగం ..అక్రమ రవాణా వంటి నేరాలపై ఎన్ని కఠిన శిక్షలు అమలవుతున్నప్పటికీ దేశంలోకి ఆ మత్తు పదార్ధాలను తరలించేందుకు కొందరు దుర్మార్గులు యత్నీస్తూనే ఉన్నారు. దక్షిణ సరిహద్దు ప్రాంతంలోని సౌదీ సరిహద్దు దళం 672 కిలోల హషీష్ ను అక్రమమగా తరలించేందుకు యత్నిస్తున్న 35 మంది అక్రమ రవాణాదారులను అరెస్టు చేశారు . బోర్డర్ గార్డ్స్ ప్రతినిధి కల్నల్ సాహర్ అల్ హర్బి మాట్లాడుతూ, తాము అరెస్ట్ చేసిన వారిలో 23 మంది ఇథియోపియన్లు, 12 మంది యెమెన్ దేశస్తులు సౌదీ భూభాగానికి మాదక ద్రవ్యాలను తరలించడానికి గత 10 రోజులలో వారు వివిధ ప్రయత్నాలను చేశారు. మాదకద్రవ్యాల అక్రమ రవాణా చేసే బృందం పరిశీలనలో ఉన్నజాజాన్, నజ్రాన్, అసీర్ దక్షిణ సరిహద్దు ప్రాంతాల్లోని హషీష్ ను అక్రమ రవాణా చేయడానికి చేసిన పలు ప్రయత్నాలను సౌదీ సరిహద్దు దళం అడ్డుకున్నాయి.గత వారంలో స్వాధీనం చేసుకున్న మాదక ద్రవ్యాలు మరియు అనుమానితులను సంబంధిత చట్టపరమైన చర్యలకు తగిన అధికారుల వద్దకు సూచించినట్లు ఆయన ధ్రువీకరించారు .మాదక ద్రవాల అక్రమ రవాణా చేసే అన్ని ప్రయత్నాలను అడ్డుకుంటుంది. సౌదీ అరేబియా రాజ్య సరిహద్దులకు పటిష్టమైన భద్రత, స్థిరత్వం, సామర్థ్యాలను బెదిరించే ఏదైనా అదుపు చేయటానికి సరిహద్దు దళం సంసిద్ధంగా ఉంటుందని ఆల్-హర్బి తెలిపారు.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్‌తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్‌ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి