యోగా మాస్టర్ గా పేరు తెచ్చుకున్నాఏడేళ్ళ బాలుడు

- February 06, 2018 , by Maagulf
యోగా మాస్టర్ గా పేరు తెచ్చుకున్నాఏడేళ్ళ బాలుడు

యోగా ఎన్నో వ్యాధులనుంచి విముక్తి లభిస్తుంది.. మానసిక ప్రశాంతత చేకూరుస్తుంది.. వ్యాధి నుంచి విముక్తి కోసం యోగాను సాధన చేసిన ఓ ఏడేళ్ళ బుడతడు ఇప్పుడు టీచర్ గా మారి.. అతిపిన్న వయస్కుడైన యోగా మాస్టర్ గా పేరు తెచ్చుకున్నాడు. లక్షల్లో సంపాదిస్తున్నాడు. 

చైనాలోని ఝెజియాంగ్ ప్రావిన్స్ లోని తైఝౌ కు చెందిన సున్ చూయాంగ్ అనే బాలుడికి రెండేళ్ల వయసులో ఆటిజం వ్యాధి బారిన పడ్డాడు.. దీంతో తల్లిదండ్రులు ఆ బాలుడిని చికిత్స నిమిత్తం వైద్యుడు వద్దకు తీసుకొని వెళ్ళగా.. వారు యోగా చేస్తే ఆరోగ్యవంతుడు అవుతాడు అని సూచించారు. దీంతో సున్ ఏడాదిపాటు యోగాను కఠోర సాధనచేసి ఆటిజం వ్యాధి నుంచి విముక్తి పొందాడు. సున్ కు అప్పటి నుంచి యోగాపై ఇష్టం పెరిగింది.. దీంతో యోగను మరింత సాధన చేసి.. టీచర్ గా మారాడు. ప్రస్తుతం సున్ టీవీ షోల్లో పాల్గొంటున్నాడు.. మూడు సినిమాల్లో కూడా నటించాడు.. ఇప్పటివరకూ సున్ యోగా తో రూ.10లక్షలు సంపాదించాడు అని బాలుడు తల్లిదండ్రులు చెప్పారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com