నెం.1 లైసెన్స్‌ ప్లేట్‌ కొనుగోలుదారుకి మూడేళ్ళ జైలు

- February 06, 2018 , by Maagulf
నెం.1 లైసెన్స్‌ ప్లేట్‌ కొనుగోలుదారుకి మూడేళ్ళ జైలు

అబుదాబీకి చెందిన బిజినెస్‌ మేన్‌కి మూడేళ్ళ జైలు శిక్ష విధించడం జరిగింది. అబుదాబీ నెం.1 లిమిటెడ్‌ లైసెన్స్‌ ప్లేట్‌ని ఈ వ్యాపారవేత్త 31 మిలియన్‌ దిర్హామ్‌లకు కైవసం చేసుకున్నాడు. అయితే ఆ మొత్తం చెల్లించే క్రమంలో బ్యాడ్‌ చెక్‌ని అందించినట్లు బిజినెస్‌మేన్‌పై అభియోగాలు మోపబడ్డాయి. నెంబర్‌ ప్లేట్‌ని కొనుగోలు చేసి, పనికిరాని చెక్‌ ఇచ్చారంటూ నిర్వాహకులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో, కేసు నమోదు చేసిన పోలీసులు, విచారణ చేపట్టి, కేసుని ప్రాసిక్యూషన్‌కి రిఫర్‌ చేశారు. బౌన్స్‌ చెక్‌ ఇచ్చినట్లు విచారణలో తేలింది. ఆ నెంబర్‌ ప్లేట్‌ని ఇంకొకరికి అమ్మేందుకు ముందుగానే ఒప్పందం కుదుర్చుకుని, తద్వారా వచ్చే సొమ్ములోంచి కొంత లాభం తీసుకోవాలనుకున్నాడు నిందితుడు. అయితే ఎవరైనా సరే పూర్తి మొత్తం చెల్లించి, నెంబర్‌ ప్లేట్‌ సొంతం చేసుకున్నాకే దాన్ని రీసేల్‌ చేసే అవకాశం ఉంటుందని అధికారులు అంటున్నారు. అతని చర్యలు పూర్తిగా చట్ట వ్యతిరేకమని నిర్ధారించారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com