పెట్టుబడులతో రండి సకల సౌకర్యాలు, సత్వర అనుమతులు ఇస్తాం ‘షరాఫ్ గ్రూపు’ను ఆహ్వానించిన ఏపీ సీఎం
- February 08, 2018
దుబాయ్: భారత ప్రభుత్వం ఆహార శుద్ధి రంగంలో సరైన విధానం ప్రకటిస్తే ఆంధ్రప్రదేశ్‌లో ఫుడ్ ప్రాసెసింగ్ జోన్ ఏర్పాటుకు సిద్ధంగా వున్నామని షరాఫ్ గ్రూపు ప్రతినిధులు దుబాయ్ పర్యటనలో వున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు వెల్లడించారు. ఏపీలో ఫుడ్ ప్రాసెసింగ్ జోన్ నెలకొల్పే అంశంపై గతంలోనే ప్రతిపాదనలు ఇచ్చామని, ఇందుకు సంబంధించి ఆంధ్రప్రదేశ్‌లో వివిధ ప్రాంతాలను పరిశీలించామని తెలిపారు. ప్రస్తుతం యూనిట్ నెలకొల్పేందుకు అవసరమైన భూసేకరణకు ఎదురుచూస్తున్నామని చెప్పారు.
లాజిస్టిక్స్ వ్యవహారాలలో భారత ప్రభుత్వం ప్రస్తుతం అనుసరిస్తున్న విధానం తమకు అంత సానుకూలంగా, తమ అవసరాలకు తగ్గట్టుగా లేదని షరాఫ్ గ్రూపు ప్రతినిధులు అభిప్రాయాన్ని వ్యక్తం చేయగా, ఈ రంగంలో అత్యుత్తమ విధానం కోసం ప్రయత్నిస్తామని ముఖ్యమంత్రి బదులిచ్చారు. ఫుడ్ ప్రాసెసింగ్ జోన్ ఏర్పాటుతో పాటు ఆహార శుద్ధి పరిశ్రమలకు సంబంధించిన లాజిస్టిక్స్‌పైనా దృష్టి సారించినట్టు షరాఫ్ గ్రూపు ప్రతినిధులు చెప్పారు. ఆహార శుద్ధి పరిశ్రమల అవసరాలకు తగ్గట్టుగా రవాణా సదుపాయాలు కల్పించాలని ముఖ్యమంత్రిని కోరారు. ఆహాదశుద్ధి పరిశ్రమలకు సంబంధించి భూముల కేటాయింపు తదితర విషయాల్లో రాష్ట్ర ప్రభుత్వం ఇతోధికంగా సహకారం అందిస్తుందని, దీనికోసం వెంటనే తమ ప్రభుత్వాధికారులతో సంప్రదింపులు జరపవచ్చని ముఖ్యమంత్రి వారికి సూచించారు. ఎలాంటి అనుమతులైనా సత్వర ఇవ్వడంలో తమ ప్రభుత్వం ముందుంటుందని హామీ ఇచ్చారు. అనేక అంశాల్లో ఏపీ ప్రభుత్వం చురుగ్గా వ్యవహరిస్తోందని షరాఫ్ గ్రూపు వైస్ చైర్మన్ షరాఫుద్దీన్ మొహమ్మద్ హుస్సేన్ షరాఫ్ ప్రశంసించారు. త్వరలో తమ సంస్థ అత్యున్నతస్థాయి బృందాన్ని ఏపీకి పంపిస్తామని ముఖ్యమంత్రికి తెలిపారు. దుబాయ్‌లో తమ ఆధ్వర్యంలో నిర్వహించే వ్యాపారవేత్తల సదస్సుకు హాజరుకావాలని హుస్సేన్ షరాఫ్ ఆహ్వానించారు.
భారత్‌లో ఇప్పటికే 300 మిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టిన ఫరాఫ్ గ్రూపు, పుణె, లుథియానాలో వ్యాపారాన్ని కేంద్రీకరించింది. సంస్థ విస్తరణకు తమిళనాడులో ఇప్పటికే భారీగా భూమిని సేకరించింది.
ముఖ్యమంత్రి బృందంలో ఆర్ధిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు, ప్రభుత్వ సలహాదారు డాక్టర్ పరకాల ప్రభాకర్, ముఖ్యమంత్రి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సతీష్ చంద్ర, ముఖ్యమంత్రి ముఖ్య కార్యదర్శి జి. సాయిప్రసాద్, మౌలికవసతుల శాఖ ముఖ్య కార్యదర్శి అజయ్ జైన్, ఏపీఈడీబీ సీఈవో జాస్తి కృష్ణ కిషోర్ వున్నారు.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్‌తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్‌ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి