ఒమన్‌లో వలసదారుల సంఖ్య తగ్గుదల
- February 08, 2018
మస్కట్: ఒమన్‌లో వలసదారుల సంఖ్య గణనీయంగా తగ్గింది. ఒమన్‌కి చెందిన 11 గవర్నరేట్స్ పరిధిలో 8 గవర్నరేట్లలో ఈ తగ్గుదల ఎక్కువగా నమోదయ్యింది. 0.08 శాతం తగ్గుదల నమోదయినట్లు గణాంకాలు చెబుతున్నాయి. మస్కట్ పరిధిలో నవంబర్ - డిసెంబర్ మధ్య 9808 మంది వలసదారులు తగ్గారు. మస్కట్‌లో నవంబర్ 2017 నాటికి 955,455 మంది వలసదారులు నివసిస్తుండగా, 2017 ఏడాది చివరి నాటికి ఈ సంఖ్య 948,342గా నమోదయ్యింది. దోపార్లో 248,628 నుంచి 247,010కి తగ్గింది. అల్ బతినా సౌత్, అల్ బురైమి, ముసాదాం, షర్కియా సౌత్, షర్కియా నార్త్, అల్ వుస్తా ప్రాంతాల్లోనూ వలసదారుల సంఖ్యలో తగ్గుదల నమోదయ్యింది. అయితే అద్ దఖ్లియా, అల్ బతినా నార్త్, అద్ దహిరాలో వలసదారుల సంఖ్య పెరిగింది.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్‌తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్‌ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి