చేప ఇగురు పులుసు

- February 10, 2018 , by Maagulf
చేప ఇగురు పులుసు

కావలసిన పదార్థాలు: చేపలు - ఒక కేజీ, చింతపండు -రెండు నిమ్మకాయలంత, ఉల్లిపాయలు - రెండు, పచ్చి మిరపకాయలు- 5, అల్లం వెల్లుల్లి పేస్టు - ఒక స్పూన్‌, ఉల్లిపాయ-కొత్తిమీర పేస్టు - ఒక స్పూన్‌, గరంమసాలా - అరస్పూన్‌, మిరపపొడి - ఒకస్పూన్‌, ఉప్పు -తగినంత, పెరుగు- రెండు స్పూన్‌లు, బెల్లం పొడి- అర స్పూన్‌, పసుపు- తగినంత, పోపు దినుసులు- కావలసినంత, నూనె - సరిపడా. 
తయారుచేయు విధానం: ముందుగా చేపముక్కలను ఆవిరిపై ఉడికించుకోవాలి. తరువాత ముల్లు తీసివేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక పాత్రలో నూనె వేసి కాస్త వేడి అయ్యాక పోపు దినుసులు వేసి వేయించుకోవాలి. తరువాత తరిగిన ఉల్లిపాయలు, పచ్చి మిర్చి వేసుకోవాలి. అల్లంవెల్లుల్లి పేస్టు, ఉల్లిపాయ-కొత్తిమీర పేస్టు, పసుపు వేసి కలుపుకోవాలి. అందులో చింతపండు పులుసు పోసి మిరపపొడి, పెరుగు, ఉప్పు వేసి కలియబెట్టాలి. చింతపండు పులుసు మరుగుతున్న సమయంలో చేప ముక్కలను వేసుకుని ఉడికించుకోవాలి. తరువాత గరంమసాలా, బెల్లం పొడి వేసుకోవాలి. చివరగా కొత్తిమీర వేసుకుని దింపుకోవాలి.కావలసిన పదార్థాలు: చేపలు - ఒక కేజీ, చింతపండు -రెండు నిమ్మకాయలంత, ఉల్లిపాయలు - రెండు, పచ్చి మిరపకాయలు- 5, అల్లం వెల్లుల్లి పేస్టు - ఒక స్పూన్‌, ఉల్లిపాయ-కొత్తిమీర పేస్టు - ఒక స్పూన్‌, గరంమసాలా - అరస్పూన్‌, మిరపపొడి - ఒకస్పూన్‌, ఉప్పు -తగినంత, పెరుగు- రెండు స్పూన్‌లు, బెల్లం పొడి- అర స్పూన్‌, పసుపు- తగినంత, పోపు దినుసులు- కావలసినంత, నూనె - సరిపడా. 
తయారుచేయు విధానం: ముందుగా చేపముక్కలను ఆవిరిపై ఉడికించుకోవాలి. తరువాత ముల్లు తీసివేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక పాత్రలో నూనె వేసి కాస్త వేడి అయ్యాక పోపు దినుసులు వేసి వేయించుకోవాలి. తరువాత తరిగిన ఉల్లిపాయలు, పచ్చి మిర్చి వేసుకోవాలి. అల్లంవెల్లుల్లి పేస్టు, ఉల్లిపాయ-కొత్తిమీర పేస్టు, పసుపు వేసి కలుపుకోవాలి. అందులో చింతపండు పులుసు పోసి మిరపపొడి, పెరుగు, ఉప్పు వేసి కలియబెట్టాలి. చింతపండు పులుసు మరుగుతున్న సమయంలో చేప ముక్కలను వేసుకుని ఉడికించుకోవాలి. తరువాత గరంమసాలా, బెల్లం పొడి వేసుకోవాలి. చివరగా కొత్తిమీర వేసుకుని దింపుకోవాలి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com