హాంగ్‌కాంగ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం
- February 11, 2018
హాంగ్‌కాంగ్ : హాంగ్‌కాంగ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. డబుల్ డెక్కర్ బస్సు బోల్తా పడటంతో 18 మంది మృతి చెందగా, 47 మందికి గాయాలయ్యాయి. మృతుల్లో ముగ్గురు మహిళలు కూడా ఉన్నారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అభిమానులు హార్స్ రేసులను వీక్షించడానికి వేసిన ప్రత్యేక బస్సు, థాయ్ పో నుంచి షాటిన్ రేస్‌కోర్స్ వెళ్తుండగా ఈప్రమాదం చోటు చేసుకుంది. అతివేగమే ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది. బస్సు బోల్తా పడిన అనంతరం రోడ్డు పక్కనే ఉన్న బస్సు స్టేషన్‌పైకి దూసుకెళ్లింది. బోల్తా పడిన తర్వాత రెస్క్యూ సిబ్బంది బస్సు టాప్‌ను కట్ చేసి అందులో ఇరుక్కున్న ప్రయాణికులను బయటకు తీశారు.
ఈ ఘటనపై కోవ్‌లోన్ మోటర్ బస్సు కంపెనీ లిమిటెడ్ మేనేజర్ సో వాయ్ కీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢసానుభూతి తెలిపారు. ఒక్కో బాధిత కుటుంబానికి 80,000 హాంగ్‌కాంగ్ డాలర్లు(దాదాపు రూ. 6.50 లక్షలు) ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్‌తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్‌ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి