దుబాయ్‌లో హిందూ ఆలయానికి శంకుస్థాపన మోదీ
- February 11, 2018
అబుదాబి : దుబాయ్‌లో తొలి తొలి హిందూ దేవాలయానికి ప్రధాని నరేంద్ర మోదీ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా అక్కడి ఓపెరా హౌస్‌లో ప్రవాస భారతీయులను ఉద్దేశించి మోదీ ప్రసంగించారు. భారత్ - యూఏఈ మధ్య ఎప్పట్నుంచో మంచి సంబంధాలున్నాయని గుర్తు చేశారు. హిందూ దేవాలయ నిర్మాణానికి ప్రవాస భారతీయులు చేస్తున్న కృషి అభినందనీయమని కొనియాడారు. ఆలయ నిర్మాణానికి యూఏఈ యువరాజు మోహముద్ బిన్ అనుమతి ఇవ్వడం ప్రశంసించదగ్గ విషయమన్నారు. దుబాయ్‌లో హిందూ దేవాలయం నిర్మిస్తున్నందుకు 125 కోట్ల భారతీయుల తరపున కృతజ్ఞతలు తెలిపారు. గల్ఫ్ దేశాలకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఇండియా నుంచి వచ్చిన సుమారు 30 లక్షల మందికి స్వంత దేశంలో ఉంటున్న వాతావరణం కల్పించడం సంతోషాన్నిస్తుందన్నారు. ఈజ్ ఆఫ్ డూయింగ్‌లో భారతదేశం మెరుగైన స్థానంలో ఉందని గుర్తు చేశారు. దేశాభివృద్ధికి ఎన్నో సవాళ్లను అధిగమించి ముందుకెళ్తున్నామని మోదీ పేర్కొన్నారు. భారత్ వేగంగా అభివృద్ధి చెందుతుందన్న మోదీ.. ప్రపంచ వ్యాప్తంగా తమ దేశానికి గుర్తింపు వచ్చిందని తెలిపారు.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్‌తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్‌ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి