మానసికంగా ఎదగని యువతిపై అత్యాచారం జరిపిన నిందితుడి కోసం పోలీసులు గాలింపు

- February 11, 2018 , by Maagulf
మానసికంగా ఎదగని యువతిపై  అత్యాచారం జరిపిన నిందితుడి కోసం పోలీసులు గాలింపు

కువైట్:కామంతో కళ్ళు మూసుకుపోయిన ఓ మానవ మృగం.. మానసికంగా ఎదగని ఓ అమాయక యువతిపై అత్యాచారం జరిపి తన నివాసం నుంచి వెలుపలికి గెంటివేశాడు. ఆ యువతీ తండ్రి నిందితుడిపై పోలీసులకు పిర్యాదు చేశాడు. ఈ దుర్మార్గానికి ఒడిగట్టిన నేరస్థుడు  ఒక సిరియన్ జాతీయుడిగా గుర్తించారు ఈ కేసుని అపరాధపరిశోధకులు తీవ్రంగా పరిగణించి ఆ కామపిశాచి కోసం అన్వేషిస్తున్నారు. మానసికంగా ఎదగని ఓ 21 ఏళ్ల అమాయకురాలిని ఆ సిరియన్ దేశస్థుడు తన ఇంటికి తీసుకువెళ్ళి శారీరకంగా మరియు లైంగికంగా పలుమార్లు దాడి చేశాడు. తనకేమి జరిగిందో సైతం తెలియని ఆ బాధితురాలిని వైద్య పరీక్షల నిమిత్తం ఫోరెన్సిక్స్ నిపుణుల చెంతకు పంపబడింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com