అపార్ట్‌మెంట్‌లో అగ్ని ప్రమాదం: ఇద్దరు చిన్నారులు సహా ఐదుగురి మృతి

- February 12, 2018 , by Maagulf
అపార్ట్‌మెంట్‌లో అగ్ని ప్రమాదం: ఇద్దరు చిన్నారులు సహా ఐదుగురి మృతి

షార్జా:షార్జాలో సోమవారం తెల్లవారుఝామున 3 గంటల సమయంలో జరిగిన అగ్ని ప్రమాదం ఐదుగుర్ని బలిగొంది. మృతిచెందినవారిలో ఇద్దరు చిన్నారులున్నారు. మొరాకోకి చెందిన మహిళ, ఆమె ఇద్దరు చిన్నారులు, ఓ భారతీయ పురుషుడు, ఓ పాకిస్తానీ మహిళ మృతి చెందినవారిలో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. మంటల్ని అదుపు చేసే క్రమంలో సివిల్‌ డిఫెన్స్‌, పోలీస్‌ విభాగాలకు చెందిన తొమ్మిది మంది అస్వస్థతకు గురయ్యారు. ఓ ఫ్లాట్‌లోని ఎయిర్‌ కండిషనర్‌లో తలెత్తిన సాంకేతిక లోపం కారణంగా అగ్ని ప్రమాదం జరిగినట్లు పోలీసులు ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. బ్యాచిలర్స్‌ వుంటోన్న ఫ్లాట్‌లోంచి మంటలు వ్యాపించాయి. ఈ ఘటనలో ఎలాంటి క్రిమినల్‌ మోటివ్‌ లేదని పోలీస్‌ ఆపరేషన్స్‌ డైరెక్టర్‌ బ్రిగేడియర్‌ మొహమ్మద్‌ రషీద్‌ బయాత్‌ చెప్పారు. అగ్ని ప్రమాదానికి గల కారణాలపై విచారణ చేపడ్తున్నామని ఆయన తెలిపారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com