కువైట్ సిటీలో ఇరాక్ పునర్మిర్మాణానికి 8800 కోట్ల డాలర్లు
- February 13, 2018
కువైట్ సిటీ : ఐసిస్‌తో ఏళ్ళ తరబడి సాగిన యుద్ధంలో ధ్వంసమైన ఇరాక్‌ను పునర్నిర్మించడానికి 8800 కోట్ల డాలర్లుకు పైగా నిధులు అవసరమవుతాయని ప్రణాళికా శాఖ మంత్రి సల్మాన్ అల్ జుమైలి తెలిపారు. కువైట్ సిటీలో ఇరాక్ పునర్నిర్మాణంపై జరిగిన అంతర్జాతీయ సమావేశంలో మాట్లాడుతూ ఆయన, మూడు రోజుల పాటు జరిగే ఈ సమావేశంలో కోట్లాది డాలర్లను సేకరించగలమని ఆశిస్తు న్నట్లు తెలిపారు. ఐసిస్‌పై విజయం సాధించినట్లు డిసెంబరులో ఇరాక్ ప్రకటించింది. దాదాపు మూడేళ్ళుగా సాగిన ఈ యుద్ధంలో దేశంలో పలు ప్రాంతాలు విధ్వంసానికి గురయ్యాయి.
లక్షలాదిమంది నిర్వాసి తులయ్యారు. ఇరాక్, అంతర్జాతీయ నిపుణులు నిర్వ హించిన అధ్యయనం, అంచనాలు ప్రాతిపదికన ఇంత మొత్తం వ్యయమవుతుందని అంచనాకు వచ్చినట్లు ప్రణాళికా మంత్రి తెలిపారు. వీటిలో 2200కోట్ల డాలర్ల వరకు తక్షణమే అవసరమవుతాయని ప్రణా ళికా శాఖ డైరెక్టర్ జనరల్ క్వాసి అబ్దుల్ఫత్తా చెప్పారు. యుద్ధ బాధిత ప్రాంతాల్లో ఇప్పటికే కొన్ని నిర్మాణ కార్యకలాపాలు ప్రారంభించామన్నారు. అయితే ఇరా క్కు అవసరమైన దానిలో కనీసం ఒక శాతం కూడా ఈ పనులు లేవని పునర్మిర్మాణ నిధి అధ్యక్షుడు ముస్తఫా చెప్పారు.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్‌తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్‌ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి