యూఏఈ వీకెండ్‌ వెదర్‌: బలమైన గాలులు, ధూళి, వర్షం కురిసే అవకాశం

- February 15, 2018 , by Maagulf
యూఏఈ వీకెండ్‌ వెదర్‌: బలమైన గాలులు, ధూళి, వర్షం కురిసే అవకాశం

అబుదాబీ, అల్‌ అయిన్‌ సహా యూఏఈలోని పలు ప్రాంతాల్లో ఫాగ్‌, మిస్ట్‌ కవర్‌ చేసి ఉన్నాయి. దాంతో రోడ్లపై విజిబిలిటీ గణనీయంగా పడిపోయింది. ఎన్‌సిఎంఎస్‌, వాతావరణ పరిస్థితుల్ని తెలియజేస్తూ, గురువారం విజిబిలిటీ 1000 మీటర్ల కంటే తక్కువగా ఉందని పేర్కొంది. బలమైన గాలులు, అలాగే డస్ట్‌ స్టార్మ్స్‌, తేలికపాటి వర్షం యూఏఈలోని పలు ప్రాంతాల్లో కురుస్తాయని వెల్లడించింది ఎన్‌సిఎంఎస్‌. శనివారం వరకూ ఇదే తరహా వాతావరణ పరిస్థితులుంటాయి. ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోనున్నాయి. కొన్ని ప్రాంతాల్లో వాతావరణం పొడిగా ఉండొచ్చనీ, అయితే ఆకస్మికంగా మేఘాలు ఏర్పడి, ఎక్కడికక్కడ వర్షాలు కురిసే అవకాశం కూడా ఉందని ఎన్‌సిఎంఎస్‌ హెచ్చరిస్తోంది. వాహనదారులు అప్రమత్తంగా ఉండాలనీ, దుమ్ము - ధూళితో కూడిన బలమైన గాలులతో ప్రమాదాలు సంభవించవచ్చునని తెలిపింది ఎన్‌సిఎంఎస్‌. అరేబియన్‌ గల్ఫ్‌ మరియు ఒమన్‌ సీలలో సముద్ర మోడరేట్‌గా ఉండొచ్చు. 4 నుంచి 6 అడుగుల ఎత్తున అలలు ఎగసిపడే అవకాశముంది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com