గోంగూరతో మీల్‌మేకర్
- February 15, 2018
కావలసిన పదార్థాలు: మీల్‌మేకర్ -100 గ్రా., గోంగూర - 2 కట్టలు, ఉల్లిపాయలు - 2, పచ్చిమిర్చి - 4, ఎండుమిర్చి - 2, వెల్లుల్లి - 6 రేకలు, జీలకర్ర - అర టీ స్పూను, కారం - 1 టీస్పూను, పసుపు - చిటికెడు, నూనె - 1 టేబుల్ స్పూను, వేగించిన నువ్వుల పొడి - అరకప్పు, ఉప్పు - రుచికి తగినంత.
తయారుచేసే విధానం: గోరు వెచ్చని నీటిలో కొద్దిగా ఉప్పు వేసి మీల్‌మేకర్‌ని 10 నిమిషాలు నానబెట్టి నీరు పిండి పక్కనుంచాలి. నూనెలో జీలకర్ర, ఎండుమిర్చి, వెల్లుల్లి, ఉల్లి తరుగు, పచ్చిమిర్చి వేగించి మీల్‌మేకర్ కలపాలి. 5 నిమిషాల తర్వాత (సన్నగా తరిగిన) గోంగూర వేసి మూతపెట్టాలి. 2 నిమిషాల తర్వాత కారం, పసుపు, ఉప్పు చల్లి 2 కప్పుల నీరు పోసి మూత పెట్టి మగ్గించి దించెయ్యాలి. ఈ కూర అన్నంతో కలుపుకుంటే మటన్ గోంగూర తిన్న ఫీలింగ్ కలుగుతుంది.
తాజా వార్తలు
- క్రిప్టో కరెన్సీ, బ్లాక్ చైన్ సహా సరికొత్త ఆర్థిక నేరాలపై ఫోకస్: డీజీపీ అంజనీ కుమార్
- ముగిసిన హెచ్-1బీ వీసా అప్లికేషన్లు..
- మెక్సికో నగరంలో ఘోర అగ్నిప్రమాదం..39 మంది మృతి
- హైదరాబాద్ లో ఆస్కార్ విజేత చంద్రబోస్కు సత్కారం..
- జీ-20 సదస్సు-2023కు విశాఖ రెడీ
- ప్రజాగ్రహంతో దిగొచ్చిన ఇజ్రాయెల్ ప్రధాని..
- హైదరాబాద్ నగరాన్ని ఆహ్లాదకరంగా మార్చేందుకు కృషి
- పాన్-ఆధార్ లింక్ గడువు పెంపు..
- అదనపు ఆదాయాన్నిచ్చే ‘సెకండ్ శాలరీ’..!
- ఆకాశంలో కనువిందు చేయనున్న 5 గ్రహాలు..!