2019 చివరి నాటికి సిద్ధమవుతున్న నూతన ఫర్వాణీయ హాస్పిటల్

- February 16, 2018 , by Maagulf
2019 చివరి నాటికి సిద్ధమవుతున్న నూతన ఫర్వాణీయ హాస్పిటల్

కువైట్ : సుప్రీం కౌన్సిల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ డెవలప్మెంట్ జనరల్ సెక్రటేరియట్ లో నిర్మాణ పురోగతిని పరిశీలించే జట్టు  కొత్త ఫర్వాణీయ హాస్పిటల్ ప్రాజెక్ట్ స్థలాన్ని సందర్శించింది. ఈ ప్రాజెక్ట్ 2019 డిసెంబర్ చివరినాటికి పూర్తి చేయాలని ప్రణాళికా సహాయ కార్యదర్శి మరియు నిర్మాణ పురోగతి పరిశీలకుడు బాడెర్ అల్-రిఫై భావిస్తున్నారు. మొత్తం ఈ ప్రణాళికలో నాలుగు భవనాలున్నాయి, ఇందులో 955 పడకల సామర్ధ్యం కల్గి వుంది., ఔట్ పేషెంట్ క్లినిక్ లు, హెలిపోర్ట్, 157 దంత వైద్య శాలలు, 1400 వాహనాల సామర్థ్యాన్ని కలిగి ఉన్న ఒక బహుళ అంతస్తుల కారు పార్కింగ్, ఒక ఇంటిగ్రేటెడ్ ఇంజనీరింగ్ సర్వీసెస్ భవనంతో పాటు,ఈ  కొత్త ఆసుపత్రికి కువైట్ దేశస్థులకు 1,560 ఉద్యోగ అవకాశాలు ఈ ఆసుపత్రిలో కల్పించబడతాయని రిఫే తెలిపారు. 2019 చివరి నాటికి సిద్ధమవుతున్న నూతన ఫర్వాణీయ హాస్పిటల్ పథకానికి 264 మిలియన్లు ఖర్చుకానున్నట్లు తెలిపారు ఈ నిర్మాణ పురోగతి పర్యటనలోబాడెర్ అల్-రిఫై తో పాటు డైరెక్టర్ సూద్ అల్-ఆవాద్ ,సూపెర్వైజర్  వఫా అల్ దబాయన్ లు ఉన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com