బహరేన్‌లో ఘనంగా కేసీఆర్ జన్మదిన వేడుకలు
- February 16, 2018
బహ్రెయిన్: తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు 64వ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని ఎన్నారై టిఆర్ఎస్ సెల్ బహరేన్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి స్వీట్లను పంచుకొని పబ్లిక్ గార్డెన్లో చెట్ల మొక్కను నాటారు.
అనంతరం ప్రెసిడెంట్ రాధారపు సతీష్ కుమార్, వైస్ ప్రెసిడెంట్ బోలిశెట్టి వెంకటేష్ మాట్లాడుతూ నాడు టిఆర్ఎస్ పార్టీ పెట్టి రాష్ట్రాన్ని కోట్లాడి తెచ్చి తొలి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నాలుగున్నర ఏండ్లుగా పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో అన్ని వర్గాల అభివృద్ధికి కెసిఆర్ ఆహార్నిశలు కృషి చేస్తున్నారని అన్నారు.
రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలోకి నడిపిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశ పెట్టిన ప్రభుత్వ పథకాలను విన్నూత రీతిలో సోషల్ మీడియా ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పారు. ప్రభుత్వ వ్యతిరేకులకు పథకాలతోనే సరైన సమాధానం ఇవ్వాలని అన్నారు.
గల్ఫ్ దేశాలలో ఉన్న కూడా మన కేసీఆర్ పుట్టినరోజు జరుపుకోవడం అనందంగా ఉందని అన్నారు. ఎన్నారై టిఆర్ఎస్ బహ్రెయిన్ కు సలహాలు సూచనలు అందిస్తూ సెల్ ను ప్రోత్సహిస్తున్న ఎంపీ కల్వకుంట్ల కవితకు, మంత్రి కేటీఆర్‌కు తెరాస ఎన్నారై కోఆర్డినేటర్ మహేష్ బిగాలకు, పార్టీ నాయకులందరికి కృతజ్ఞతలు తెలిపారు.
ఈ వేడుకల్లో ప్రెసిడెంట్ రాధారపు సతీష్ కుమార్‌తో పాటు వైస్ ప్రెసిడెంట్ వెంకటేష్ బోలిశెట్టి, జనరల్ సెక్రెటరీలు లింబాద్రి, డా రవి, సెక్రెటరీలు రవిపటేల్, రాజేంధార్, జాయంట్ సెక్రెటరీలు దేవన్న, సుధాకర్, ఎగ్సిక్యుటివ్ మెంబర్స్ రాజేష్, నర్సయ్య, రాజు, సిహెహచ్ రాజేందర్, భజన్న, వెంకటేష్, సాయన్న, వసంత్, గంగారాం తదితరులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్‌తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్‌ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి