అగ్ని ప్రమాదం: కార్మికుల్ని రక్షించిన ఆఫ్ డ్యూటీ మహిళా కాప్
- February 16, 2018
రస్ అల్ ఖైమా సివిల్ డిపార్ట్మెంట్, ఫస్ట్ లెఫ్టినెంట్ మోజా అల్ ఖబౌరిని ఘనంగా సత్కరించింది. ఓ వర్కర్స్ అకామడేషన్‌లో అగ్ని ప్రమాదం సంభవించగా, ఆ ప్రమాదం నుంచి కార్మికుల్ని రక్షించినందుకుగాను మోజా అల్ ఖబౌరికి ఈ సత్కారం లభించింది. తన ఇద్దరు కుమారులతో కలిసి ఆమె ఓ క్లబ్ నుంచి తిరిగి వస్తుండగా ఈ ఘటన జరిగింది. ఆఫ్ డ్యూటీలో ఉన్నా, పరిస్థితిని అర్థం చేసుకున్న ఆమె అగ్ని ప్రమాదం నుంచి కార్మికుల్ని క్షేమంగా రక్షించారు. ఫైర్ బ్రిగేడ్స్ అక్కడికి చేరుకునేదాకా పరిస్థితిని ఆమె చక్కదిద్దారు. రస్ అల్ ఖైమా సివిల్ డిఫెన్స్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ బ్రిగేడియర్ జనరల్ మొహమ్మద్ అల్ జాబి మాట్లాడుతూ, సాయంత్రం 4.30 నిమిషాల సమయంలో ఘటనకు సంబంధించిన సమాచారం అందిందని, సకాలంలో అక్కడికి తాము చేరుకుని పరిస్థితిని చక్కదిద్దామని చెప్పారు.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్‌తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్‌ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి