బుర్జ్ ఖలీఫాపై చైనీస్ న్యూ ఇయర్ సంబరాలు
- February 17, 2018
దుబాయ్:డ్రాగన్ థీమ్‌తో కూడిన సౌండ్ అండ్ లైట్ షో బుర్జ్ ఖలీఫాపై అత్యద్భుతంగా జరిగింది. చైనీస్ న్యూ ఇయర్ వేడుకల్లో భాగంగా ఈ థీమ్‌ని దుబాయ్‌లోని బుర్జ్ ఖలీఫాపై ప్లే చేశారు. డౌన్ టౌన్ దుబాయ్ విజిటర్స్ ఈ అత్యద్భుత ఘట్టాన్ని చూసి సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యారు. యూఏఈలో నివసిస్తున్న చైనీయులు, అలాగే యూఏఈ సందర్శించేందుకు వచ్చినవారికి ఈ షో అమితానందాన్ని కలిగించింది. చైనాకు చెందిన ఓ వలసదారుడు హాటీ మాట్లాడుతూ, దుబాయ్‌లో ఇప్పటిదాకా జరిగిన చైనా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్‌లో ఇదే అతి గొప్పదని అన్నారు. స్వదేశంలో వున్నామన్న భావన తమకు కలిగిందని చెప్పారు. కొరియన్ వలసదారుడు యుమి సాంగ్ మాట్లాడుతూ, చైనీస్‌కి మాత్రమే కాదు, అందరికీ ఈ సెలబ్రేషన్స్ ఎంతో ఆనందాన్నిచ్చాయని వివరించారు. ఎమ్మార్ ప్రాపర్టీస్ నిర్వహణలో ఈ సో జరిగింది. దుబాయ్ మాల్లో చైనీస్ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్‌లో భాగంగా పలు ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టారు. యూఏఈలో 4,200 చైనా కంపెనీలు వుండగా, సుమారు 243,000 మంది చైనా జాతీయులు దుబాయ్‌లో నివసిస్తున్నారు.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్‌తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్‌ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి