మొజాంబిక్ రాజధాని మపుటోనగరంలోకుప్పకూలిన చెత్తకుప్ప
- February 20, 2018
మొజాంబిక్- 17మంది మృతి, పలువురికి గాయాలు
మపుటో: మొజాంబిక్ రాజధాని మపుటో నగరంలో సోమవారం నుండి కురుస్తున్న భారీ వర్షాలకు నగర శివార్లలో వున్న ఒక చెత్తకుప్ప కుప్పకూలిన ఘటనలో కనీసం 17 మంది మరణించారని, పలువురు గాయపడ్డారని అధికారులు చెప్పారు. సోమవారం రాత్రి ఈ ప్రమాదం జరిగిన సమయంలో ఈ పరిసర ప్రాంతాలలో నివశించే వారంతా నిద్రలో వున్నారని, భారీ వర్షాలతో కుంగిన చెత్తకుప్ప పక్కనే వున్న ఇళ్లపై కూలిపోవటంత వారంతా తమ ఇళ్లలోనే సజీవ సమాధి అయ్యారని తెలుస్తోంది. సమాచారం తెలుసుకున్న అధికారులు మంగళవారం ఉదయం నుండి అక్కడ సహాయ కార్యక్రమాలు ప్రారంభించారు. అగ్నిమాపక సిబ్బంది శిధిలాల్లో చిక్కుకున్న వారితో పాటు మృతదేహాల కోసం గాలింపు ప్రారంభించారు. భవిష్యత్తులో ఇటువంటి ప్రమాదాలు జరగకుండా తగిన చర్యలు తీసుకునే అంశంపై చర్చించేందుకు అధికారయంత్రాంగం మంగళవారం భేటీ అవుతోందని మపుటో సిటీ గవర్నర్ యోలాండా సించురా చెప్పారు. ఈ దుర్ఘటనలో ఇళ్లు కోల్పోయిన వారిని గుర్తించి వారికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయనున్నట్లు ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించిందని ఆమె వివరించారు రాజధాని మపుటోనగరంలోకుప్పకూలిన చెత్తకుప్ప.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్‌తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్‌ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి