పెద్దమొత్తంలో లిక్కర్‌ స్వాధీనం: 21 మంది అరెస్ట్‌

- February 20, 2018 , by Maagulf
పెద్దమొత్తంలో లిక్కర్‌ స్వాధీనం: 21 మంది అరెస్ట్‌

మనామా: కింగ్‌డమ్‌లో పెద్దయెత్తున మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ క్రిమినల్‌ ఇన్వెస్టిగేషన్‌, ఫోరెన్సిక్‌ సైన్స్‌ ఈ విషయాన్ని వెల్లడించింది. మొత్తం 21 మంది సభ్యులుగల ముఠా ఈ సందర్భంగా అరెస్టయ్యింది. ఆసియాకి చెందినవారు ఈ గ్యాంగ్లఓ ఉన్నారు. శాండ్‌ కారియర్‌ వెహికిల్‌ని మద్యాన్ని స్మగుల్‌ చేసేందుకు నిందితులు వినియోగించినట్లు అధికారులు వెల్లడించారు. దేశంలోకి దాన్ని డంప్‌ చేసి, అక్కడినుంచి వేర్‌ హౌస్‌లలోకి తరలిస్తున్నారు నిందితులు. పోలీసులు ఈ ముఠా గుట్టు రట్టు చేస్తూ 200,000 బహ్రెయినీ దినార్స్‌ విలువైన మద్యాన్ని, అలాగే 36,000 దినార్స్‌ నగదుని వారి నుంచి స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై చట్టపరమైన చర్యల నిమిత్తం పబ్లిక్‌ ప్రాసిక్యూషన్‌కి అప్పగించనున్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com