కువైట్ లోని ప్రైవేట్ నివాస ప్రాంతాలలో ఉండే బ్రహ్మచారులకు బాధాకరమైన వార్త

- February 21, 2018 , by Maagulf
కువైట్ లోని ప్రైవేట్ నివాస ప్రాంతాలలో ఉండే బ్రహ్మచారులకు బాధాకరమైన వార్త

కువైట్ :  " బ్రహ్మచారి..శత మర్కటహ ( వంద కోతులు) తో సమానం  " అనే మన సామెత బహుశా .. అరబ్బు షేకులకు ఇటీవల బాగా అర్థమైందని తెలుస్తుంది. అందుకే ఫర్వానియా గవర్నర్ షేక్ ఫైసల్ అల్-హమౌడ్ తన గవర్నట్ పరిధిలో వ్యక్తిగత నివాస ప్రాంతాలలో నివసిస్తున్నబ్రహ్మచారుల బెడదను ఎదుర్కోవడంలో ఎలాంటి రాజీ పడటం లేదని ధ్రువీకరించారు. కువైట్ లో ప్రైవేటు ఇళ్లలో బ్రహ్మచారులు ఉండటానికి అనుమతి లేదు.ఈ అంశంపై సమగ్ర చర్చకు..అనంతరం తీసుకోవాల్సిన చర్య గూర్చి ప్రైవేటు ఇళ్ళల్లో బాచిలర్స్ కు అద్దెకు ఇవ్వడమా లేదా అనే విషయంపై నిర్వహించబడుతున్న సర్వే. షేక్ ఫైసల్ అల్హాముద్ మాట్లాడుతూ ప్రైవేటు నివాస ప్రాంతాలలో నివసిస్తున్న బ్రహ్మచారులు ఉనికి భరించలేమని అత్యధికులు తమ అభిప్రాయం వెలిబుచ్చారు. వీరి ఆగడాల వలన సామాజిక మరియు భద్రతా పరిణామాలకు అంతరాయం కలగడమే కాక, కొన్ని ప్రాంతాలలో పౌరులకు కనీసం నిద్రపోయే స్వేచ్ఛ సైతం కోల్పోతున్నారని సర్వే తేల్చి చెప్పింది. ఈ విషయంలో గవర్నరేట్ కు అనేక ఫిర్యాదులను స్థానికుల నుంచి అందుకున్నారు. ఈ సమస్యను అరికట్టడానికి సహాయపడే చర్యలను అన్నింటిని పరిగణన లోనికి తీసుకొని అవసరమైన చర్యలను చేపట్టేందుకు అంతర్గత మంత్రిత్వశాఖ  కువైట్ మున్సిపాలిటీ  పైన పేర్కొన్న నిర్ణయం తీసుకొంది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com