దేశ తొలి మహిళా ఫైటర్ ఎయిర్‌క్రాఫ్ట్ పైలట్‌గా అవని చతుర్వేది

- February 21, 2018 , by Maagulf
దేశ తొలి మహిళా ఫైటర్ ఎయిర్‌క్రాఫ్ట్ పైలట్‌గా అవని చతుర్వేది

హైదరాబాద్: దేశ తొలి మహిళా ఫైటర్ ఎయిర్‌క్రాఫ్ట్ పైలట్‌గా అవని చతుర్వేది నిలిచి రికార్డు నెలకొల్పింది. జామ్‌నగర్ ఎయిర్‌బేస్ నుంచి సోమవారం నాడు ఒంటరిగా 30 నిమిషాల పాటు మిగ్-21 సూపర్ సోనిక్ యుద్ధ విమానాన్ని నడిపి చరిత్ర సృష్టించింది. అత్యుత్తమ ఫైటర్ ఎయిర్‌క్రాఫ్ట్ పైలెట్‌గా ఎగరాలనుకుంటున్నా. ఈ క్రమంలో ప్రతీరోజు నేర్చుకుంటూనే ఉంటానని అవని పేర్కొంది. అవని స్వస్థలం మధ్యప్రదేశ్‌లోని దియోలాండ్ అనే చిన్న పట్టణం. ఎయిర్‌చీఫ్ మార్షల్ బీ ఎస్ ధనోవ్ స్పందిస్తూ.. అవనీకి హృదయపూర్వక అభినందనలు తెలిపారు. మహిళా అధికారులను ప్రోత్సహించడంలో ఐఏఎఫ్ ఎల్లప్పుడూ ముందుంటుందని తెలిపారు. ప్రస్తుత ఫైటర్ పైలట్ల శిక్షణ బ్యాచ్‌లో ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ మొత్తం ముగ్గురు మహిళలకు అవకాశం కల్పించింది. వీరిలో అవని చతుర్వేది ఒకరు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com