హైదరాబాద్ః జీడిమెట్ల పారిశ్రామికవాడలోభారీ అగ్ని ప్రమాదం,4 గురు మృతి
- February 22, 2018
హైదరాబాద్ః జీడిమెట్ల పారిశ్రామికవాడలో శుక్రవారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఓ కెమికల్ గోడౌన్లో పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడుతున్నాయి. ప్రమాదం జరిగినప్పుడు కార్మికులు గోడౌన్లో పనిచేస్తున్నారు. ఎనిమిది మంది కార్మికులు తీవ్రంగా గాయపడగా వారిలో 4 గురు మృతి చెందారు. వెంటనే వారిని ఆస్పత్రికి తరలించారు. మంటల్లో ఇంకా పలువురు కార్మికులు ఉన్నట్లు అనుమానిస్తున్నారు. ప్రమాద సమయంలో ఫ్యాక్టరీలో 15మంది కార్మికులు ఉన్నట్లు తెలుస్తోంది. సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకుని ఆరు ఫైరింజన్లతో మంటల అదుపునకు యత్నిస్తున్నారు. పక్కనే పలు కంపెనీలు ఉండటంతో వాటిలోకి మంటలు వ్యాపిస్తున్నాయి. ప్రమాదంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. కాగా ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్‌తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్‌ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి