యుద్ధభూమి' సినిమా ట్రైలర్ విడుదల
- February 24, 2018
హైదరాబాద్: మలయాళ సూపర్‌స్టార్ మోహన్‌లాల్, అల్లు శిరీష్ కీలక పాత్రల్లో నటించిన చిత్రం '1971: బియాండ్ బోర్డర్స్'. మేజర్ రవి దర్శకుడు. గతేడాది మలయాళంలో విడుదలైన ఈ చిత్రం మంచి టాక్‌ను తెచ్చుకుంది. తాజాగా ఈ సినిమాను 'యుద్ధభూమి: 1971 భారత సరిహద్దు' పేరుతో తెలుగులో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇటీవల చిత్ర బృందం 'యుద్ధభూమి' థియేట్రికల్ ట్రైలర్‌ను విడుదల చేసింది. 1971లో భారత్-పాకిస్థాన్‌ల మధ్య జరిగిన యుద్ధం నేపథ్యంలో ఈ సినిమా సాగుతుంది. ఇందులో మోహన్‌లాల్ కల్నల్ మహదేవన్ పాత్ర పోషించగా, అల్లు శిరీష్ లెఫ్టినెంట్ చిన్మయ్ పాత్రలో కనిపించనున్నారు. 'వార్ ఫీల్డ్‌లో లవ్ లెటర్స్‌కు రొమాన్స్‌కి నో టైమ్' అంటూ అల్లు శిరీష్‌కు మోహన్‌లాల్ సలహా ఇస్తూ కనిపించారు. సిద్ధార్థ్ విపిన్, నజీమ్ అర్షద్, రాహుల్ సుబ్రమణియన్‌లు సంగీతం అందించగా, గోపీ సుందర్ నేపథ్య సంగీతం అందించారు. జస్రాజ్ ప్రొడక్షన్స్ సమర్పణలో శ్రీ లక్ష్మీ జ్యోతి క్రియేషన్స్ పతాకంపై ఏఎన్ బాలాజీ నిర్మిస్తున్నారు. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుందీ చిత్రం.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్‌తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్‌ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి