శ్రీదేవి మృతి పట్ల రజనీకాంత్, కమల్ హాసన్‌ల స్పందన
- February 24, 2018
శ్రీదేవి మృతి పట్ల కోలీవుడ్ స్టార్ హీరోలు రజనీకాంత్, కమల్ హాసన్‌లు స్పందించారు. సూపర్ స్టార్ రజనీకాంత్ శ్రీదేవి మరణవార్త షాక్‌కు గురిచేసిందని తెలిపారు. నేను మంచి స్నేహితురాలిని కోల్పోయాను. చిత్రసీమ మంచి నటిని కోల్పోయిందన్న రజనీ.. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలిపారు. లోకనాయకుడు కమల్ హాసన్ స్పందిస్తూ ‘వసంత కోకిల సినిమాలో చిన్న పాపలా, తల్లిలా తనను ఆడించిన నాకు.. శ్రీదేవి మరణవార్త జీర్ణించుకోలేనిది. ఆమె కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి’ అని తెలిపారు.
స్టార్ హీరోయిన్ నయనతార మాట్లాడుతూ ‘ఓ మంచి నటి, దేశం గర్వించదగిన మహిళ, నటీమణులకు మార్గదర్శి అయిన శ్రీదేవి మృతి అందరికీ తీరనిలోటు’ అన్నారు. మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్, సీనియర్ హీరోయిన్ ఖుష్భూ సుందర్, అదితిరావ్ హైదరీలతో పాటు పలువురు సినీ ప్రముఖులు, విశ్లేషకులు శ్రీదేవి మృతిపట్ల సంతాపం తెలిపారు.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్‌తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్‌ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి