రామోజీ ఫిల్మ్‌సిటీలో 'సాక్ష్యం' సినిమా షూటింగ్
- March 01, 2018
బెల్లంకొండ శ్రీనివాస్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం 'సాక్ష్యం'. పూజా హెగ్డే కథానాయిక. శ్రీవాస్ దర్శకుడు. అభిషేక్ నామా నిర్మాత. ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో చిత్రీకరణ జరుగుతోంది. అక్కడ ప్రత్యేకంగా తీర్చిదిద్దిన సెట్‌లో ప్రధాన తారాగణంపై కీలకమైన సన్నివేశాల్ని తెరకెక్కిస్తున్నారు. త్వరలో అమెరికాలో మరో షెడ్యూల్ జరగబోతోంది. దాంతో షూటింగ్ పూర్తవుతుంది. మే 11న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ ''ఇటీవల విడుదల చేసిన ప్రచార చిత్రాలకు మంచి స్పందన వస్తోంది. ఇప్పటికే డిజిటల్ రైట్స్ మంచి ధరకు అమ్ముడయ్యాయి. శాటిలైట్, డిజిటల్ రైట్స్ కలిపి రూ.13.5 కోట్లు పలికాయి. అత్యున్నత సాంకేతిక విలువలతో తెరకెక్కుతున్న చిత్రమిది. శ్రీవాస్ కథని తీర్చిదిద్దుతున్న విధానం బాగుంది. పీటర్ హెయిన్స్ నేతృత్వంలోని యాక్షన్ సన్నివేశాలు అలరిస్తాయన్నారు. సంగీతం: హర్షవర్థన్
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్‌తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్‌ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి