సంతానలేమిని అధిగమించే గింజలు.. పురుషులు తినాల్సినవివే...

- March 03, 2018 , by Maagulf
సంతానలేమిని అధిగమించే గింజలు.. పురుషులు తినాల్సినవివే...


నేడు చాలామంది దంపతులు ఎదుర్కొనే సమస్య సంతానలేమి. ఈ సమస్యలో చాలామంది మానసికంగా కృంగిపోతున్నారు. అయితే ఈ సమస్యలో ఎక్కువ శాతం పురుషుల వీర్యంలో సంతానసాఫల్యం కోసం తగినన్ని వీర్యకణాలు లేకపోవడమే. మందులు కంటే కూడా తీసుకునే ఆహారంలో వీర్యకణాలు పెంపొందించే ఆహారం తీసుకోవడం చాలా మంచిది. నల్లశనగలు బహుముఖ పోషక పదార్థం. వీటిని రోజువారీ ఆహారంలో తీసుకోవడం వల్ల వీర్యకణాల లోపాన్ని సులభంగా దూరంచేసుకోవచ్చు. ఇవి పురుషులలో వీర్యకణాల సమస్యను దూరం చేసే లక్షణాలను పుష్కలంగా కలిగి ఉన్నాయి.
 
1. గుప్పెడు శనగలు, నాలుగు బాదం పప్పులను రాత్రిపూట నీళ్ళలో నానబెట్టాలి. ఉదయాన్నే వాటిని పరగడుపున బాగా నమిలి తినాలి. ఇలా కొన్ని రోజులు చేస్తుండటం వల్ల పురుషులలో వీర్యకణాలు పెరిగే అవకాశం ఉంది.
 
2. రాత్రిపూట ఒక కప్పు శనగలను నానబెట్టాలి. ఉదయాన్నే ఆ శనగలలో బెల్లం కలిపి తినడం వల్ల మగవారిలో శృంగార సామర్థ్యం పెరగడంతో బాటు వీర్యకణాల వృద్ది కూడా పెరుగుతుంది. 
 
3. గుప్పెడు శనగలను ఉడకపెట్టి వాటిని స్వచ్చమైన నేతిలో వేయించి ప్రతిరోజు ఉదయాన్నే తీసుకోవాలి. తరువాత గోరువెచ్చని పాలు తాగాలి. ఇలా చేయడం వల్ల శరీరం దృఢంగా అవడమే కాకుండా వీర్యకణాల సంఖ్య కూడా మెరుగుపడుతుంది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com