రాజమౌళి ఆజ్ఞపై అమెరికా వెళ్తున్న రాముళ్ళు
- March 07, 2018
ఎన్టీఆర్.. రామ్ చరణ్.. ఒకరు నందమూరి హీరో మరొకరు మెగా హీరో.. వీరిద్దరూ కలిసి కనిపిస్తే ఫ్యాన్స్ కు సాధారణ ప్రేక్షకుడికి కూడా తెలియని ఆనందం. ఆఫ్ స్క్రీన్ లో వీరిద్దరూ కలిసి కనిపించడం కామన్. కానీ రాజమౌళి డైరెక్షన్ లో వీరిద్దరూ కలిసి ఆన్ స్క్రీన్ పై కనిపించనున్నారనే వార్తలు వచ్చినప్పటి నుంచి ఈ హంగామా మరింత ఎక్కువగా ఉంది.
రీసెంట్ గా ఎన్టీఆర్- చరణ్ ఇద్దరూ కలిసి శంషాబాద్ ఎయిర్ పోర్టులో దర్శనం ఇచ్చారు. ఇద్దరూ బ్యాగులు తగిలించుకుని ఎక్కడికో జర్నీ చేస్తున్నారు. వీరి వాలకం చూస్తే ఇద్దరూ కలిసే ప్రయాణం చేయబోతున్నారనే సంగతి అర్ధమవుతుంది. ఇంతకీ యంగ్ టైగర్, మెగా పవర్ స్టార్లు కలిసి ఎక్కడికి వెళుతున్నారనే ఆసక్తి అందరిలోనూ కనిపించింది. వీరంతట వీరేమీ సమాచారం చెప్పలేదు కానీ.. అసలు విషయం అయితే కలిసి నటించబోయే సినిమా కోసమే అంటున్నారు. వీరిద్దరితో ఓ వర్క్ షాప్ నిర్వహించేదుకు రాజమౌళి సిద్ధమవుతున్నాడనే వార్తలు ఇప్పటికే వచ్చాయి.
అయితే.. ఈ వర్క్ షాప్ ఇండియాలో కాదట. అమెరికాలో ఉంటుందని.. అందుకే ఎన్టీఆర్- చరణ్ ఇద్దరూ కలిసి అక్కడకే బయల్దేరారని అంటున్నారు. అందుకు తగ్గట్లే ఇప్పుడు ఇద్దరూ ఇలా ఎయిర్ పోర్టులో కూడా దర్శనమిచ్చారు. ఓ పది రోజుల పాటు ఈ కార్యక్రమం ఉంటుందట. అక్కడే ఓ ఫోటోషూట్ కూడా నిర్వహించే అవకాశాలున్నాయని.. సినిమా ప్రకటన సమయంలో ఈ ఫోటోలు బయటకు వస్తాయని టాక్ వినిపిస్తోంది.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్‌తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్‌ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి