ఈ నాలుగు తీసుకుంటే చాలు..

- March 08, 2018 , by Maagulf
ఈ నాలుగు తీసుకుంటే చాలు..

శృంగార హార్మోన్లలను పెంచడానికి పాలు తేనెను పురాతన కాలం నుండి ఉపయోగిస్తున్నారు. ఇవేకాక బాదం, ఖర్జూరం, మొలకెత్తిన విత్తనాలు గుడ్లు, తాజా ఆకుకూరలు తీసుకోవాలి. కీరదోస, బీట్ రూట్, క్యారెట్‌లను కలిపి జ్యూస్‌లాగా చేసుకుని ప్రతి రోజు ఒక గ్లాసు తీసుకోవడం వల్ల శృంగార సామర్ద్యం పెరుగుతుంది. వీటితో పాటు ఆపిల్, దానిమ్మ, నేరేడు పండ్లు, నిమ్మపండ్లను ఆహారంలో చేర్చుకోవాలి.
 
1. మునగాకుని పసుపు, ఉప్పు వేసి బాగా ఉడికించి పేస్ట్‌లా చేసుకోవాలి. ప్రతిరోజు ఉదయం బ్రేక్‌ఫాస్ట్ తరువాత దీనిని రెండు స్పూన్లు తింటే మగవారిలో వీర్యం వృద్ధి చెందుతుంది. శీఘ్ర స్ఖలన సమస్య తగ్గి లైంగికంగా సమర్థత పెరుగుతుంది.
 
2. అరటిపండులో ఉండే బ్రొమోలైన్ అనే ఎంజైమ్ శృంగార శక్తిని పెంపొందిస్తుంది. పురుషులలో లైంగిక సమస్యలు చాలా వరకు తగ్గిస్తుంది. అరటిపండులో ఉండే పొటాషియం మరియు విటమిన్ బి శరీరానికి కావల్సిన శక్తిని అందిస్తుంది.
 
3. కోడిగుడ్లలో విటమిన్ బి 5, బి 6 పుష్కలంగా ఉంటాయి. ఇవి హార్మోన్లను బ్యాలెన్స్ చేస్తాయి. ఇవి అధిక లైంగిక వాంఛను కలిగిస్తాయి.
 
4. అశ్వగ్రంది శృంగార శక్తిని పెంచడానికి అద్భుతంగా సహాయపడుతుంది. ఎల్లప్పుడూ శృంగార శక్తిని పెంచడానికి భారతీయ ఆయుర్వేద వైద్యంలో దీనిని ఎక్కువుగా ఉపయోగిస్తారు. చిటికెడు పల్లేరుకాయ చూర్ణాన్ని, ఒక టీస్పూన్ అశ్వగ్రంది చూర్ణాన్ని ఒక కప్పుపాలలో కలిపి బాగా మరిగించి వడపోసుకుని పడుకునే సమయంలో తాగితే మగవారిలో లైంగిక బలహీనత తగ్గుతుంది. ఇలా 10, 15 రోజులు వాడటం వల్ల మంచి ఫలితం ఉంటుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram
Copyrights 2015 | MaaGulf.com