ఇల్లీ పై వస్తున్న అనుమానం నిజమేనా..!
- April 18, 2018
గోవా బ్యూటీ ఇలియానా మళ్లీ వార్తల్లోకి వచ్చేసింది. నిత్యం అభిమానులతో టచ్‌లోవుండే ఈ అమ్మడు, ఈసారి ఆమె సీక్రెట్ పిక్‌ని బయటపెట్టాడు ఆస్ట్రేలియాకి చెందిన ఫోటోగ్రాఫర్ ఆండ్రూ నీబోన్. ఇప్పటికే ఇలియానా సీక్రెట్‌గా మ్యారేజ్ చేసుకుందని వార్తలు వచ్చాయి. తాజాగా ఆమె తల్లి కాబోతుందంటూ మరో గాసిప్ స్ప్రెడ్ అవుతోంది. ఇందుకు కారణాలు చాలానే వున్నాయి.
రైడ్ సినిమా ప్రమోషన్స్ కోసం మీడియా ముందుకి వచ్చినప్పుడు ఇల్లీ.. ప్రెగ్నెంట్ అన్న విషయం ఎవరికీ తెలియకుండా మేనేజ్ చేసిందంటూ బాలీవుడ్ వర్గాలు కోడై కూస్తున్నాయి. దీనికితోడు ఇలియానా ప్రియుడు ఆండ్రూ నీబోన్ రీసెంట్‌గా తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పిక్‌ని పోస్ట్ చేశాడు. బాత్ టబ్‌లో కాఫీ తాగుతూ ఇలియానా ఒంటరిగా తియ్యని అనుభవంతో సేద దీరుతోందా? అంటూ వెరైటీ కామెంట్ పెట్టాడు. దీంతో అందరిలోనూ అనుమానాలు మళ్లీ మొదల య్యాయి. మొత్తానికి గ్లామర్ ఇండస్ర్టీలో పెద్దగా సినిమాల్లేకపోయినా ఏదోవిధంగా తన గురించి తానే సీక్రెట్‌ని బయటపెట్టుకుంటోంది ఈ అమ్మడు.
తాజా వార్తలు
- ఒమన్ ప్రావిన్స్ లలో భారీగా వర్షం
- విదేశీ ఉద్యోగులకు ఆరోగ్య బీమా కచ్చితంగా ఉండాలి
- గాజా పై దాడిని ఖండించిన సౌదీ అరేబియా
- గజా పై ఇజ్రాయిల్ దాడిని ఖండించిన బహ్రెయిన్
- అనుమతి లేని ప్రదేశంలో ఉన్న పోలీస్ కార్ పై చర్యలు
- ఎయిర్పోర్ట్ ఏరియాలో నడుచుకుంటూ వెళ్లిన ప్రయాణికులు..
- 'TANA' ఆధ్వర్యంలో పేద విద్యార్థులకు స్కూల్ బ్యాగ్యుల పంపిణీ
- బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులతో బ్రేక్ ఫాస్ట్ చేసిన టి.గవర్నర్ తమిళిసై
- నింగిలోకి దూసుకెళ్లిన ఎస్ఎస్ఎల్వీ శాటిలైట్
- భారత్ కరోనా అప్డేట్