ఆ అజ్ఞాతవాసి పేరు బయట పెట్టిన పవన్ కళ్యాన్!

- April 21, 2018 , by Maagulf
ఆ అజ్ఞాతవాసి పేరు బయట పెట్టిన పవన్ కళ్యాన్!

ఈ విషయాన్ని తాను కూడా లీగల్ గానే వెళ్తానని..చెబుతున్నారు జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాన్. కాగా, నిన్న ఫిలిమ్ ఛాంబర్ లో మూడు టివి ఛానల్స్ పై నిప్పులు చెరిగిన పవన్ మరికొంత మంది పేర్లు కూడా బయట పెడతానని అన్నారు. ఈ నేపథ్యంలో పవన్ ఆరోపణలు చేసిన శ్రీని రాజు(శ్రీసిటీ ఓనర్) అతడికి లీగల్ నోటీసులను పంపారు. దానికి సంబంధించిన కాపీలను సోషల్ మీడియాలో షేర్ చేసిన పవన్.. మీ బెదిరింపులకు బెదిరిపోనని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా..'' శ్రీని రాజు మీరు పంపిన నోటీసులు నన్నేం మార్చలేవు.

రియల్ అఙ్ఞాతవాసి రవి ప్రకాశ్ చొరవతో మా తల్లిపై జరిగిన అవమానాన్ని మీరు పదే పదే చూపించారు. మీ సీఈవో, అలాగే అతడిని ప్రభావితం చేసిన రాజకీయనాయకులు అందరిపై న్యాయపోరాటం చేస్తా. గుడ్‌లుక్ శ్రీని'' అని కామెంట్ పెట్టారు.. శ్రీ సిటీలో వాటాల కోసం రాజకీయ బాసులతో కుమ్మక్కైన రవి ప్రకాశ్ ఈ చర్యకు ఒడిగట్టాడని పవన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. చేసిందంతా చేసి ఇప్పుడు తనకు లీగల్ నోటీసులు పంపించడమేంటని శ్రీనిరాజుని ప్రశ్నించారు. శ్రీనిరాజు తనకు పంపిన లీగల్ నోటీసుల ప్రతిని పవన్ తన పోస్ట్ లో పేర్కొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram
   

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com