రామ్ చరణ్, బోయపాటి షూటింగ్ ప్రారంభం

- April 22, 2018 , by Maagulf
రామ్ చరణ్, బోయపాటి షూటింగ్ ప్రారంభం

రంగస్థలం తరవాత ఏ మాత్రం బ్రేక్ తీసుకోవడం లేదు రామ్ చరణ్. తన తరువాతి చిత్రం కోసం నేటి నుంచి షూటింగ్‌కు హాజరయ్యాడు. ఈ రోజు నుండి బోయపాటి డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న సినిమా సెట్స్‌పైకి వచ్చేశాడు. మాస్ యాక్షన్ డైరెక్టర్ బోయపాటి శ్రీనుతో తన 12వ చిత్రాన్ని చెర్రీ చేస్తున్నాడు. ఈ సినిమా ఇప్పటికే 2 షెడ్యూల్స్‌లను సక్సెస్ ఫుల్‌గా పూర్తి చేసుకుంది. నేటి నుంచి మూడో షెడ్యుల్‌ను ప్రారంభించారు. బోయపాటి మార్క్ అల్ట్రా మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కనుందీ సినిమా. రామ్ చరణ్‌ని డిఫెరెంట్ డైమెన్షన్‌లో ప్రెజెంట్ చేసే ప్రాసెస్‌లో ఉన్నాడు బోయపాటి.

ఈ సినిమాలో వివేక్ ఒబెరాయ్ ముఖ్య పాత్రలో నటిస్తున్నాడు. ప్రశాంత్, స్నేహ, రమ్యకృష్ణ ముఖ్య పాత్రలలో కనిపించనున్నారు. డివివి ఎంటర్‌టైన్మెంట్ బ్యానర్‌పై డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన భరత్ అను నేను ఫేమ్ కైరా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తుంది. ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ కంపోజర్. ఇప్పటికే ఈ మూవీకి రాజవంశస్థుడు అనే వర్కింగ్ టైటిల్ ఫిక్స్ చేసినట్లు సమాచారం.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com