శౌర్య అలా ఎందుకు కామెంట్ చేసాడో తనకు ఇప్పటికీ అర్ధం కాని విషయం..సాయి పల్లవి

- April 23, 2018 , by Maagulf
శౌర్య అలా ఎందుకు కామెంట్ చేసాడో తనకు ఇప్పటికీ అర్ధం కాని విషయం..సాయి పల్లవి

క్రేజీ హీరోయిన్ సాయి పల్లవి నటించిన 'కణం' మూవీ ఈవారం విడుదల కాబోతోంది. తమిళ దర్శకుడు ఎ.ఎల్. విజయ్ దర్శకత్వం వహించిన ఈమూవీ ఒక వెరైటీ స్టోరీతో తీయబడి బాగా వచ్చిందని ప్రచారం జరుగుతోంది. నాలుగు సంవత్సరాల పాప చుట్టూ నడిచే ఈకథలో తల్లిగా సాయి పల్లవి అద్భుతంగా నటించిందని వార్తలు వస్తున్నాయి. 

సమ్మర్ రేసులో విడుదల అవుతున్న భారీ సినిమాల తాకిడి తట్టుకోలేక ఇప్పటికే అనేక సార్లు రిలీజ్ వాయిదా పడ్డ ఈమూవీ ధైర్యం చేసి ఈవారం విడుదల కాబోతోంది. ఈ నేపధ్యంలో ఈసినిమాను ప్రమోట్ చేస్తూ ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సాయి పల్లవి తాను నాగ శౌర్య కు చేసిన ఫోన్ కాల్ విషయం బయట పెట్టింది. 

కొంతకాలం క్రితం తనకు నాగ శౌర్యతో విభేదాలు వచ్చాయి అన్న విషయం పై స్పందిస్తూ నాగశౌర్యకు తన వల్ల 'కణం' సినిమా షూటింగ్ లో అవమానం జరిగింది అన్న విషయాన్ని తెలుసుకుని తాను నాగ శౌర్యకు ఫోన్ చేసి ఆ విషయాల పై క్లారిటీ తీసుకుందామని ప్రయత్నించినా నాగ శౌర్య తన ఫోన్ కాల్ ను పట్టించుకోకుండా అందుబాటులోకి రాలేదు అన్న విషయాన్ని బయట పెట్టింది సాయి పల్లవి. అంతేకాదు నాగ శౌర్య చాలా మంచి నటుడని చాలా కామ్ గా ఉంటాడని చెపుతూ తన గురించి శౌర్య అలా ఎందుకు కామెంట్ చేసాడో తనకు ఇప్పటికీ అర్ధం కాని విషయం అనీ క్లారిటీ ఇచ్చింది ఈబ్యూటి. 

తనకు పని తప్ప వేరే ధ్యాస ఉండదని చెపుతూ తన పాత్ర గురించి దర్శకుడితో ఒకటికి పదిసార్లు చర్చిస్తానని అది శౌర్యను ఇబ్బంది పెట్టి ఉండొచ్చని అంటోంది సాయి పల్లవి. మంచి నటిగా తాను ఎంతో పేరు తెచ్చుకున్నా అవకాశాల కోసం తాను ఏదర్శకుడుని అడగనని తనకు వచ్చిన అవకాశాలలో నచ్చిన పాత్రలను మాత్రమే చేస్తాను అంటోంది. ప్రస్తుతం ఈమె గురించి మన టాప్ యంగ్ హీరోలు ఎవరు పట్టించుకోకపోయినా కోలీవుడ్ టాప్ హీరోలు మాత్రం సాయి పల్లవి కావాలి అంటూ పట్టుపడుతున్న నేపధ్యంలో ఆమెకు ఇప్పుడు తెలుగులో కన్నా తమిళంలో ఎక్కువ అవకాశాలు వస్తున్నాయి..

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com