రామ్ చరణ్ బావతో శ్రియా భూపాల్ నిశ్చితార్థం..!!
- April 23, 2018
జీవీకే కుటుంబానికి చెందిన శ్రియా భూపాల్ ప్యాషన్ డిజైనర్‌గా తనకంటూ గుర్తింపు తెచ్చుకుంది. అక్కినేని అఖిల్‌తో శ్రియా నిశ్చితార్థం జరగడం తర్వాత క్యాన్సిల్ అయిన విషయం తెలిసిందే. అఖిల్‌తో బ్రేకప్ తర్వాత శ్రియా భూపాల్ గురించి పలు వార్తలు వచ్చాయి. అనిందిత్ తో ప్రేమలో ఉన్నట్టు అతనితో కలిసి శ్రియా తిరుగుతున్నట్లు చాలా వదంతలు వినిపించాయి. తాజాగా శ్రియా, అనిందిత్‌ల నిశ్చితార్థం ఆదివారం ఘనంగా జరిగినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఇందుకు సంబంధించిన ఫొటోలను వీరి బంధువు పింకీ రెడ్డి తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
ఇంతకి ఎవరి అనిందిత్ అనుకుంటున్నారా..! అతను రామచరణ్‌కు వరుసకు బావ అవుతాడు.. ఎలా అంటే.. చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, అపోలో హాస్పిటల్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సంగీతల కుమారుడు అనిందిత్. సంగీత, ఉపాసన తల్లి శోభన అక్కాచెల్లెల్లు. అంటే ఉపాసనకు అనిందిత్ సోదరుడు అవుతాడు కనుక రామచరణ్‌కు బావ అన్నమాట. ఈ వేడుకకు రామ్ చరణ్, ఉపాసనలతో పాటు ఇతర కుటుంబ సభ్యులు హాజరయ్యారు.
తాజా వార్తలు
- తెలంగాణ కరోనా అప్డేట్
- టిపిసిసి ఎన్నారై సెల్ గల్ఫ్ కన్వీనర్ గా సింగిరెడ్డి నరేష్ రెడ్డి
- ఈద్ అల్ అదా 2022: చూచాయిగా తేదీ వెల్లడి
- కిడ్నాప్ కేసులో పది మంది అరెస్ట్
- సబ్ కాంట్రాక్టర్‌కి 50,000 బహ్రెయినీ దినార్లు చెల్లించాలని ఆదేశం
- ఖతార్: త్రీడీ ప్రింటింగ్ ద్వారా భవిష్యత్తులో రోబోలు ఆసుపత్రుల్ని నిర్మించవచ్చు
- తొలి నైపుణ్య కేంద్రాన్ని ప్రారంభించిన సౌదీ, హువావే
- తెలంగాణ డీజీపీ ఫొటోతో జనాలకు సైబర్ నేరగాళ్ల వల
- కోవిడ్ నాలుగో డోస్ ప్రకటించనున్న కువైట్
- జూలై నెలలో 14రోజులు బ్యాంకులకు బంద్..సెలవులు