బాలీవుడ్ 'అర్జున్ రెడ్డి'
- April 24, 2018
తెలుగులో సంచలన విజయం సాధించిన సినిమా 'అర్జున్ రెడ్డి'. చిన్న చిన్న పాత్రలు చేసుకునే విజయ్ దేవరకొండ కు స్టార్ స్టేటస్ తీసుకొచ్చిన సినిమా 'అర్జున్ రెడ్డి'. పొగరున్న, స్వచ్చమయిన ప్రేమికుడిగా .. విజయ్ దేవరకొండ అద్భుతంగా నటించి అందరి దృష్టిని ఆకర్షించాడు. 5 కోట్ల బడ్జెట్ తో నిర్మించిన అర్జున్ రెడ్డి.. 50 కోట్లు వసూల్ చేసి ఇండియన్ సినిమా ని తన వైపు తిప్పుకుంది. తమిళం లో చియాన్ విక్రమ్ తనయుడు 'ధృవ్' హీరోగా 'వర్మ ' పేరుతో బాలా దర్శకత్వం లో 'అర్జున్ రెడ్డి ' రీమేక్ అవుతున్నది.
హిందీ లో మాత్రం, అర్జున్ రెడ్డి సినిమాకోసం హీరోగా ఎవరిని తీసుకోవాలనేది. మొన్నటివరకు.. సస్పెన్స్ గానే ఉన్నది. కొంతకాలం అర్జున్ కపూర్ అని , మరో సారి షాహిద్ కపూర్ అని పుకార్లు చక్కలు కొట్టాయి.అర్జున్ కపూరే అని అందరు అనుకుంటున్నా తరుణం లో .. నిర్మాతలు అసలు హీరో ఎవరనేది ప్రకటించేసారు.
లేటెస్ట్ న్యూస్ ప్రకారం.. షాహిద్ కపూర్ వారం రోజుల క్రితమే 'అర్జున్ రెడ్డి' రీమేక్ సైన్ చేసినట్లు సమాచారం. పద్మావతి సక్సెస్ తో ఉన్న షాహిద్, కోపిష్టి అయిన మెడికో పాత్రలో కరెక్ట్ గా సరిపోతాడని, నెటిజెన్ల తీర్పు. హీరోయిన్ ఇంకా ఫైనలైజ్ కానీ ఈ సినిమాను .. అశ్విన్ వార్డే, మురాద్ ఖేతని నిర్మిస్తున్నారు. ఈ హిందీ రీమేక్ ను ఒరిజినల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి నే డైరెక్ట్ చేయడం విశేషం.జులై నుండి సెట్స్ పైకి వెళ్లనున్న ఈ సినిమా సందీప్ కి బాలీవుడ్ లో మంచి విజయాన్ని అందించాలని కోరుకుందాం.
తాజా వార్తలు
- యూఏఈ మొదటి విమానాశ్రయం.. మ్యూజియంగా ప్రారంభం
- ఇంటి ఓనర్ సౌకర్యాల వినియోగానికి అదనంగా వసూలు చేయవచ్చా?
- జింబాబ్వే ప్రైవేట్ విమాన ప్రమాదంలో భారతీయుడు మృతి
- 7 రోజుల్లో 11,465 మంది అరెస్ట్
- స్పెయిన్-ఒమన్ ప్రైవేట్ ఈక్విటీ ఫండ్ ప్రారంభం
- అక్టోబర్ 2న అబుధాబిలో వాహనాల పై ఆంక్షలు
- విజయవాడ విద్యార్థులకు తానా స్కాలర్ షిప్ లు పంపిణీ...
- ఖతార్ లో ఘనంగా Mrs.CIA బ్రీఫింగ్ సెషన్
- ఫిలడెల్ఫియాలో ఘనంగా నాట్స్ ఆధ్వర్యంలో గణేశ్ ఉత్సవాలు
- అక్టోబర్ 07 వరకు రూ.2000 నోట్లు మార్పిడి చేసుకోవచ్చు