కువైట్:బాలికకి ఫేక్ టీచర్ లైంగిక వేధింపులు
April 27, 2018
కువైట్: టైర్ రిపెయిర్‌మేన్ ఒకరు, ఇస్లామిక్ ఎడ్యుకేషన్ టీచర్‌గా అవతారమెత్తి లైసెన్స్ లేని ఇన్‌స్టిట్యూట్‌లో ఓ బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ఈ ఘటనను రికార్డ్ చేశాడు కూడా. బట్టలు తొలగించి 9 ఏళ్ళ బాలికను వీడియోలో టీచర్ చిత్రీకరించినట్లు పౌరుడొకరు పోలీసులకు వివరించారు.పోలీసులు ఈజిప్టియన్ నిందితుడ్ని అరెస్ట్ చేశారు. విచారణలో నిందితుడు తన నేరాన్ని అంగీకరించాడు. తాను చిత్రీకరించిన వీడియో క్లిప్‌ని కూడా పోలీసులకు నిందితుడు చూపించాడు.