అమెరికా లో మెగాస్టార్ చిరంజీవి సంబరాలు..

అమెరికా లో మెగాస్టార్ చిరంజీవి సంబరాలు..

మెగా స్టార్ చిరంజీవి గతం లో ఎన్నడూ లేని విధంగా ఆనందంగా ఉన్నాడు. దీనికి కారణం తన కుమారుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మొదటిసారి రూ. 100 కోట్ల క్లబ్ లో చేరడం. సుకుమార్ - రామ్ చరణ్ కలయికలో వచ్చిన రంగస్థలం మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడమే కాదు చరణ్ లోని సరికొత్త నటుడిని బయటకు తీసింది. ఇంతవరకు చరణ్ లో చూడని నటనను ఈ మూవీ లో చేసే సరికి అందరు చరణ్ కు ఫిదా అయ్యారు. దీంతో మెగాస్టార్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయట.

ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి అమెరికా లో నిర్వహిస్తున్న మా వేడుకల్లో పాల్గొనబోతున్నారు. ఈ నేపథ్యం లో అమెరికాకు చేరుకున్న మెగా స్టార్ కు మెగా అభిమానులు ఘన స్వాగతం పలికారు. ఈ రోజు మూడు గంటలకు రెగల్ మేకార్తుర్ ఇర్వింగ్ TX లో ఈవెంట్ ను ప్లాన్ చేశారు. ఈ వేడుకలో పెద్ద సంఖ్యలో మెగా అభిమానులు పాల్గొననున్నట్లు తెలుస్తోంది.

Back to Top