ఇరాన్: ఇకపై యూరో ఆధారిత విదేశీ వాణిజ్యం
- April 30, 2018
టెహ్రాన్: డాలర్ ఆధారిత విదేశీ వాణిజ్యం నుండి యూరో ఆధారిత వాణిజ్యానికి మారనున్నట్లు ఇటీవల ప్రకటించిన ఇరాన్ అది మంగళవారం నుండి అమలులోకి వస్తున్నట్లు ప్రకటించింది. గతంలో ఇదే విధంగా అమెరికా దురాక్రమణకు కొద్ది నెలల ముందు ఇరాక్, నాటో దేశాల దాడికి కొద్ది నెలల ముందు లిబియా కూడా ఇదే విధంగా డాలర్ ఆధారిత వాణిజ్యానికి తెరదించిన విషయం తెలిసిందే. అమెరికా నేతృత్వంలోని ఆరుదేశాల కూటమితో ఇరాన్ కుదుర్చుకున్న అణు సహకార ఒప్పందం నుండి తాను వైదొలుగుతున్నట్లు ట్రంప్ ప్రకటించిన నేపథ్యంలో ఇరాన్ ఈ ప్రకటన చేసింది.
అమెరికా వైఖరిని వ్యతిరేకించిన బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ:
ఇరాన్ అణు ఒప్పందం నుండి తాము వైదొలగుతున్నట్లు ప్రకటించిన అమెరికా వైఖరిని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీలు ప్రకటించాయి. ఈ ఒప్పందాన్ని కాపాడుకునేందుకు తాము ప్రయత్నిస్తామని ఈ మూడు దేశాల నేతలు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఇరాన్‌ను అణ్వాయుధాల నుండి దూరంగా వుంచేందుకు 2015 నాటి ఈ అణు ఒప్పందమే అత్యుత్తమ మార్గమని వారు అభిప్రాయపడ్డారు.
తాజా వార్తలు
- ఒమన్ ప్రావిన్స్ లలో భారీగా వర్షం
- విదేశీ ఉద్యోగులకు ఆరోగ్య బీమా కచ్చితంగా ఉండాలి
- గాజా పై దాడిని ఖండించిన సౌదీ అరేబియా
- గజా పై ఇజ్రాయిల్ దాడిని ఖండించిన బహ్రెయిన్
- అనుమతి లేని ప్రదేశంలో ఉన్న పోలీస్ కార్ పై చర్యలు
- ఎయిర్పోర్ట్ ఏరియాలో నడుచుకుంటూ వెళ్లిన ప్రయాణికులు..
- 'TANA' ఆధ్వర్యంలో పేద విద్యార్థులకు స్కూల్ బ్యాగ్యుల పంపిణీ
- బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులతో బ్రేక్ ఫాస్ట్ చేసిన టి.గవర్నర్ తమిళిసై
- నింగిలోకి దూసుకెళ్లిన ఎస్ఎస్ఎల్వీ శాటిలైట్
- భారత్ కరోనా అప్డేట్