ఇయర్‌ ఆఫ్‌ జాయెద్‌ ఎ380 ఎయిర్‌క్రాఫ్ట్‌ ప్రారంభించిన ఎతిహాద్‌ ఎయిర్‌ వేస్‌

ఇయర్‌ ఆఫ్‌ జాయెద్‌ ఎ380 ఎయిర్‌క్రాఫ్ట్‌ ప్రారంభించిన ఎతిహాద్‌ ఎయిర్‌ వేస్‌

అబుదాబీ డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ ట్రాన్స్‌పోర్ట్‌ ఛైర్మన్‌ షేక్‌ తాయెబ్‌ బిన్‌ మొహమ్మద్‌ బిన్‌ జాయెద్‌ అల్‌ నహ్యాన్‌, 'ఇయర్‌ ఆఫ్‌ జాయెద్‌' ఎయిర్‌ బస్‌ ఎ380ని పరిశీలించారు. అబుదాబీలోని ఎతిహాద్‌ ఎయిర్‌వేస్‌ ఇంజనీరింగ్‌ ఫెసిలిటీస్‌లో ఈ విమానం కొలువుదీరింది. ఎతిహాద్‌ ఏవియేషన్‌ గ్రూప్‌ ఛైర్మన్‌ మొహమ్మద్‌ ముబారక్‌ ఫదెల్‌ అల్‌ మజ్రోయి, గ్రూప్‌ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ ఎతిహాద్‌ గ్రూప్‌ టోనీ డగ్లస్‌, అలాగే ఎతిహాద్‌ సీనియర్‌ లీడర్‌ షిప్‌ టీమ్‌ సభ్యులు, షేక్‌ తాయెబ్‌ వెంట వున్నారు. విజ్‌డమ్‌, రెస్పెక్ట్‌, సస్టెయినబిలిటీ, హ్యూమన్‌ డెవలప్‌మెంట్‌ అనే నాలుగు థీమ్స్‌తో ఇయర్‌ ఆఫ్‌ జాయెద్‌ నేపథ్యంలో ఎ380 ఎయిర్‌బస్‌ని ఈర్చిదిద్దారు. ఈ విమానంలో ప్రయాణించే ప్రయాణీకులకు షేక్‌ జాయెద్‌కి సంబంధించి అనేక విశేషాలతో కూడిన స్వాగతం పలుకుతారు. 

Back to Top