వాట్సాప్‌ సిఇఒ రాజీనామా

వాట్సాప్‌ సిఇఒ రాజీనామా

సాన్‌ఫ్రాన్సిస్కో : ఫేస్‌బుక్‌ సంస్థకు చెందిన వాట్సాప్‌ సిఇఒ జాన్‌ కౌమ్‌ తన పదవికి రాజీనామా చేయనున్నట్లు వెల్లడించారు. ఫేస్‌బుక్‌కు సంబంధించి గత కొన్ని వారాలుగా నడుస్తున్న ప్రైవేట్‌ కుంభకోణం నేపథ్యంలో ఆయన పదవికి రాజీనామా చేయనున్నట్లు పేర్కొన్నారు. ఈ విషయాన్ని ఆయన తన ఫేస్‌బుక్‌ పేజీలో సోమవారం పేర్కొన్నారు. 2014లో ఫేస్‌బుక్‌ సంస్థకు వాట్సాప్‌ను విక్రయించిన సంగతి తెలిసిందే. వినియోగదారుల డేటా భద్రత వాట్సాప్‌ ముఖ్య ఉద్దేశం. కాని డేటా భద్రతలో ఘర్షణలు వెలువడుతుండటం, వ్యక్తిగత సమాచారాన్ని వెల్లడించడానికి ఫేస్‌బుక్‌ అనుమతించడం వంటివి ముఖ్య కారణాలు. కాగా, దీనిపై ఫేస్‌బుక్‌ నిర్వాహకులు స్పందించలేదు.

Back to Top