స్టోరీ-స్క్రీన్ ప్లే-డైరక్షన్ బాలకృష్ణ

- April 30, 2018 , by Maagulf
స్టోరీ-స్క్రీన్ ప్లే-డైరక్షన్ బాలకృష్ణ

ఎప్పుడైతే బాలకృష్ణ హీరోగా ఎన్టీఆర్ బయోపిక్ గా ముహుర్తం పెట్టాడో అప్పటి నుండి ఆటంకాలు మొదలయ్యాయి. ఎన్టీఆర్ సినిమా అంటే అంచనాలు తారాస్థాయిలో ఉంటాయి. నందమూరి అభిమానులను అందరిని సాటిస్ఫై చేయాల్సిన అవసరం ఉంటుంది. ఈ క్రమంలో స్క్రిప్ట్ వర్క్ బాగానే కష్టపడిన చిత్రయూనిట్ సినిమా సెట్స్ మీదకు తెచ్చేసరికి కొత్త కష్టాలు మొదలయ్యాయి.

సినిమాలో బాలకృష్ణ 53 గెటప్పులలో కనిపిస్తారని తెలుస్తుంది. తేజ వీటన్నిటిని ఒక పాటలో చేసేద్దాం అంటే అలా కుదరదని చెప్పేశాడట అందుకే తేజ చిన్నగా ప్రాజెక్ట్ నుండి బయటకు వచ్చాడు. ఇక ఇప్పుడు ఈ బయోపిక్ డైరక్టర్స్ రేసులో క్రిష్ ఉన్నాడు. క్రిష్ కాదనక, అవుననక ఉన్నాడట.

క్రిష్ కూడా కాదంటే బాలయ్య బాబే డైరెక్ట్ చేస్తాడని తెలుస్తుంది. రాఘవేంద్ర రావు పర్యవేక్షణలో ఈ సినిమా తెరకెక్కబోతుందని అంటున్నారు. సినిమా బాలకృష్ణ డైరెక్ట్ చేసినా ఒకవేల రిజల్ట్ తేడా వస్తే ఆయనకు అపవాదాలు తప్పవని చెప్పొచ్చు. సినిమా అంతా బాలకృష్ణ కనుసన్నలలో నడుస్తుందని తెలుస్తుంది.

బాలకృష్ణ మాత్రం ఇప్పటికి ఈ ప్రాజెక్ట్ మీద పట్టు విడవలేదని తెలుస్తుంది. కచ్చితంగా అందరి అంచనాలను అందుకునేలా సినిమా తీయాలని చూస్తున్నాడట. పేరుకి నిర్మాతలు వేరే అయినా బాలకృష్ణ కూడా నిర్మాణంలో భాగస్వామ్యం అవుతున్నాడు కాబట్టి సినిమాపై తన పూర్తి దృష్టి పెడుతున్నట్టు తెలుస్తుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram
   

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com