సౌదీలో ఆ దాడి చేసింది భారతీయుడే!

- April 30, 2018 , by Maagulf
సౌదీలో ఆ దాడి చేసింది భారతీయుడే!

రియాద్‌ : సౌదీ అరేబియాలోని జెడ్డా ప్రాంతంలో రెండేళ్ల క్రితం ఆత్మాహుతి దాడికి పాల్పడింది భారతీయుడేనని సౌదీ ప్రభుత్వం నిర్ధారించింది.  2016 జూలై 4 వ తేదీన సౌదీలోని మూడు ప్రాంతాల్లో నలుగురు లష్కరే తోయిబా తీవ్రవాదులు ఆత్మాహుతి దాడులకు దిగారు. ఈ దాడుల్లో భాగంగా సౌదీ పశ్చిమ ప్రాంతంలోని యూఎస్‌ కాన్సులేట్‌ వెలుపల ఆత్మహుతి దాడి జరిపింది భారతీయుడైన ఫయాజ్‌ కాగ్జీ అని ఆరోపణలు వచ్చాయి. దీంతో సౌదీ అధికారులు ఆ దాడి దృశ్యాలను భారత జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ)కు పంపి.. నిందితుడి వివరాలు పంపాల్సిందిగా కోరారు.

దీంతో ఎన్‌ఐఏ ఆదేశాలతో మహారాష్ట్ర యాంటీ టెర్రర్ స్క్వాడ్(ఏటీఎస్‌) అధికారులు కాగ్జీ డీఎన్‌ఏ నమూనాలను 2017లో సౌదీ అధికారులకు అందజేశారు. ఆత్మాహుతి దాడికి పాల్పడిన వ్యక్తి డీఎన్‌ఏతో ఇది సరిపోలడంతో.. ఆ దాడికి పాల్పడింది కాగ్జీనే అని సోమవారం సౌదీ అధికారులు అధికారికంగా ప్రకటించారు. మహారాష్ట్రకు చెందిన కాగ్జీ 2006లో పాకిస్తాన్‌కు వెళ్లి.. అక్కడ లష్కరే తోయిబాలో చేరి పలు విధ్వంసాలకు పాల్పడ్డాడు. 2006లో జౌరంగాబాద్‌ అక్రమ ఆయుధాల రవాణా కేసులో కాగ్జీ ప్రధాన నిందితుడు. అలాగే 26/11 ముంబై దాడులకు కాగ్జీనే సూత్రధారి అనే ఆరోపణలు ఉన్నాయి.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com