200 కోట్ల క్లబ్‌లో చేరిన 'రంగస్థలం'
- April 30, 2018
రంగమ్మా మంగమ్మా ఇంకా వినిపిస్తూనే ఉంది. రామ్ చరణ్ రంగస్థలం రికార్డులను బ్రేక్ చేస్తూ 200 కోట్ల క్లబ్‌లో చేరింది. నాన్ బాహుబలి రికార్డులను సొంతం చేసుకుంది. మైత్రి మూవీ మేకర్స్ ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. మార్చి 30 న విడుదలై నెల రోజుల్లోనే అత్యధిక వసూళ్లు రాబట్టిన సినిమాగా రంగస్థలం నిలిచింది. ఈ సినిమాకు అన్నీ ప్లస్ పాయింట్లే కావడం రికార్డులు సృష్టించడానికి కారణమైంది. సుకుమార్ డైరక్షన్, రాంచరణ్ యాక్షన్‌తో మిగిలిన తారాగాణమంతా కథకు చక్కగా సరిపోయారు. అందరూ అద్భుతమైన నటనను ప్రదర్శించారు. అన్నింటికీ మించి దేవీ శ్రీ మ్యూజిక్, దానికి తోడు చంద్రబోస్ సాహిత్యం. ఒక్కటేమిటి అన్నీ కలిసొచ్చి అంశాలు రంగరించి రంగస్థలాన్ని నిర్మించారు. అందుకే అభిమానులు ఆదరించి పట్టం కట్టారు. భారీ స్థాయిలో నిర్మాతలకు విజయాన్ని అందించిన రంగస్థలం, 200 ల కోట్ల క్లబ్‌లో చేరి రామ్ చరణ్ కెరీర్లోనే అత్యధిక గ్రాస్ రికార్డులు నెలకొల్పిన చిత్రంగా నిలిచిపోతుంది.
తాజా వార్తలు
- తెలంగాణ కరోనా అప్డేట్
- టిపిసిసి ఎన్నారై సెల్ గల్ఫ్ కన్వీనర్ గా సింగిరెడ్డి నరేష్ రెడ్డి
- ఈద్ అల్ అదా 2022: చూచాయిగా తేదీ వెల్లడి
- కిడ్నాప్ కేసులో పది మంది అరెస్ట్
- సబ్ కాంట్రాక్టర్‌కి 50,000 బహ్రెయినీ దినార్లు చెల్లించాలని ఆదేశం
- ఖతార్: త్రీడీ ప్రింటింగ్ ద్వారా భవిష్యత్తులో రోబోలు ఆసుపత్రుల్ని నిర్మించవచ్చు
- తొలి నైపుణ్య కేంద్రాన్ని ప్రారంభించిన సౌదీ, హువావే
- తెలంగాణ డీజీపీ ఫొటోతో జనాలకు సైబర్ నేరగాళ్ల వల
- కోవిడ్ నాలుగో డోస్ ప్రకటించనున్న కువైట్
- జూలై నెలలో 14రోజులు బ్యాంకులకు బంద్..సెలవులు