'మయ్యమ్‌ విజిల్‌' పార్టీ యాప్‌ను ప్రారంభించిన కమల్‌

- April 30, 2018 , by Maagulf
'మయ్యమ్‌ విజిల్‌' పార్టీ యాప్‌ను ప్రారంభించిన కమల్‌

చెన్నై: ప్రముఖ సినీ నటుడు, 'మక్కల్‌ నీది మయ్యమ్‌' అధినేత కమల్‌ హాసన్‌ మంగళవారం 'మయ్మమ్‌ విజిల్‌' అనే పేరుతో పార్టీకి చెందిన యాప్‌ను ప్రారంభించినట్లు తెలిపారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ యాప్‌ పార్టీ నేతలకు అలారమ్‌లాంటిదని, సామాన్య ప్రజల సమస్యలను తెలసుకోవడానికి మా పార్టీ నేతలు పాత్రికేయుల్లాగా పనిచేయడానికి ఈ యాప్‌ ఉపయోగపడుతుందని ఆయన పేర్కొన్నారు. పార్టీలో నమోదు చేసిన నేతలకు, వ్యక్తులకు మాత్రమే అందుబాటులో ఉంటుందన్నారు. ఈ యాప్‌ ద్వారా ప్రజల సమస్యలు తెలుసుకుంటాము కాని, వెంటనే పరిష్కారం చూపలేమని, ఎందుకంటే ఈ యాప్‌ మంత్రదండం కాదని ఆయన అన్నారు. అధికారులు, నేతలపై పర్యవేక్షణకు ఈ యాప్‌ ఉపపయోగపడుతుందన్నారు. తమిళనాడును అవినీతి రహితంగా మార్చడమే తన రాజకీయ అజెండా అంటూ ఫిబ్రవరిలో 'మక్కల్‌ నీది మయ్యమ్‌' అనే పార్టీని ప్రారంభించిన సంగతి తెలిసిందే.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram
   

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com